Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా కోసం నేను రెడీ: కెవిన్ పీటర్సన్

టీమిండియా బ్యాటింగ్ కోచ్ పనిచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తెలిపాడు. టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో బ్యాటింగ్ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్దమైందని, అన్వేషణ కూడా ప్రారంభించిందని ఓ క్రికెట్ పీఆర్ చేసిన ట్వీట్‌కు కెవిన్ పీటర్సన్ బదులిచ్చాడు.

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేసేందుకు తాను అందుబాటులో ఉంటానని పీటర్సన్ సమాధానమిచ్చారు. మరోవైపు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌ను పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్‌కు స్పెషలిస్ట్ కోచ్‌ను నియమిస్తేనే టీమిండియా వరుస వైఫల్యాలకు బ్రేక్ పడుతుందనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

Kevin Pietersen Ready To Work As A India Battig Coach

దేశవాళీ క్రికెట్‌ దిగ్గజాల్లోని ఒకరిని బ్యాటింగ్‌ కోచ్‌గా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తుండగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ పనిచేస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌ టీ దిలీప్, అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటే‌లు ఉన్నారు.

ఈ ఇద్దరే టీమిండియా బ్యాటింగ్ విభాగాన్ని నడిపిస్తున్నారు. విక్రమ్ సింగ్ రాథోడ్ అనంతరం స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్‌ను నియమించలేదు. మరోవైపు గంభీర్ పర్యవేక్షణలో టీమిండియాకు ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. శ్రీలంక చేతిలో 28 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. టెస్ట్‌ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై తొలి సారి క్లీన్ స్వీప్ అయ్యింది. న్యూజిలాండ్ 3-0తో టీమిండియాను చిత్తు చేసింది.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. 1-3తో సిరీస్ కోల్పోయింది. చివరి 8 టెస్ట్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలవలేక డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను చేజార్చుకుంది. ఈ దారుణ పరాజయాలకు టీమిండియా బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. బ్యాటర్ల టెక్నికల్ సమస్యలను అధిగమించేందుకు స్పెషలిస్ట్ బ్యాటింగ్ కోచ్‌ను తీసుకోవాలనుకుంటుంది.

టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేసేందుకు కెవిన్ పీటర్సన్ ఆసక్తి చూపుతున్నాడు. కెవిన్ పీటర్సన్ తన కెరీర్‌లో 104 టెస్ట్‌ల్లో 8181 పరుగులు, 136 వన్డేల్లో 4440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు.

Story first published: Thursday, January 16, 2025, 14:28 [IST]
Other articles published on Jan 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+