Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2025 విజయం.. చిన్ని పిల్లాడిలా ఏడ్చిన సౌతాఫ్రికా ఆటగాడు! (వీడియో)

సౌతాఫ్రికా కల నెరవేరింది. 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ టైటిల్ ఎట్టకేలకు దక్కింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా శనివారం ముగిసిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ శతాబ్దంలో సౌతాఫ్రికాకు దక్కిన తొలి ఐసీసీ టైటిల్ ఇదే కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ముఖ్యంగా సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఏడుస్తూనే అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడాడు.

'ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్నవారికే కాదు.. దేశ ప్రజలందరికి ఈ టైటిల్ అందుకోవడం గర్వకారణం. గత ఐదు రోజులుగా దేశం మొత్తం చూపిన ఐకమత్యం అద్భుతం. ఒక జట్టుగా.. గర్వించదగ్గ దేశంగా ఈ విజయానికి మేం కృతజ్ఞులం. నేను బ్యాటింగ్ చేసి ఉంటే ఈ భావోద్వేగం అదుపులో ఉండేదేమో. మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. కష్ట సమయాల్లో కూడా మేం బలంగా పోరాడాం. రాబోయే గొప్ప విజయాలకు ఇది ఒక మైలు రాయి అవతుందని ఆశిస్తున్నా'అని కేశవ్ మహరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు.

Keshav Maharaj Breaks Down in Tears as South Africa Lifts WTC 2025 Title

213/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. 85 ఓవర్లలో 5 వికెట్లకు 283 పరుగులు చేసి గెలుపొందింది. మార్క్‌రమ్(207 బంతుల్లో 14 ఫోర్లతో 136) శతకంతో సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించగా.. టెంబా బవుమా(134 బంతుల్లో 5 ఫోర్లతో 66), డేవిడ్ బెడింగ్‌హమ్(49 బంతుల్లో ఫోర్‌తో 21 నాటౌట్) అతనికి అండగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్‌వుడ్ చెరో వికెట్ పడగొట్టారు.

సంక్షిప్త స్కోర్లు:

ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 83.4 ఓవర్లలో 282/5

Story first published: Saturday, June 14, 2025, 18:13 [IST]
Other articles published on Jun 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+