Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట‌ర్‌పై లైంగిక దాడి.. కోచ్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష!

క్రికెట్ ట్రైనింగ్ వచ్చిన మైనల్ బాలిక‌ను లైంగికంగా వేధించిన కేసులో కేరళ క్రికెట్ అసోసియేషన్ మాజీ కోచ్ మనుకు 35 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు తిరువనంతపురం పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తిరువనంతపురంలోని శ్రీవరగం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల క్రికెట్ కోచ్ మనుపై మొత్తం 6 పోక్సో కేసులు నమోదయ్యాయి. తన అకాడమీకి వచ్చిన చిన్నారులను లైంగికంగా వేధించాడనే అభియోగాలతో పోలీసులు ఈ కేసులు పెట్టారు.

గల్లీ క్రికెట్ ఆడినట్లే ఆడు బిడ్డా: అశ్విన్

గల్లీ క్రికెట్ ఆడినట్లే ఆడు బిడ్డా: అశ్విన్

ఇందులోని రెండో కేసును విచారించిన తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అంజు మీరా బిర్లా.. నిందితుడు మనుకు 35 ఏళ్ల కఠిన కారాగా శిక్షతో పాటు రూ.66,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో 6 ఏళ్ల 9 నెలలు జైలులో గడపాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.

Kerala Cricket Coach Sentenced to 35 Years of Rigorous Imprisonment in Minor Sexual Abuse Case

ఈ కేసు వివరాల ప్రకారం ఓ బాధితురాలు 2018లో మను అకాడమీలో చేరింది. ఆ మైనర్ బాలికకు ప్రత్యేక ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తానన్న నెపంతో జిమ్, బాత్రూమ్‌కు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. అంతేకాకుండా రహస్యంగా ఆ బాలిక ఫొటోలు, వీడియోలు కూడా తీసాడు. ఒకవేళ ఆ విషయాన్ని బయటపెడితే ఆమె క్రికెట్ భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ బాలిక 2019లో అకాడమీని విడిచిపెట్టింది.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం! (వీడియో)

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం! (వీడియో)

ఏళ్లు గడిచినా ఆ చిన్నారులు భయంతో మౌనంగా ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో తిరువనంతపురం వేదికగా జరిగిన మహిళల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కోచ్‌ మనును మళ్లీ చూసిన బాధిత విద్యార్థి భయంతో గట్టిగా ఏడ్చేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో మను లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో మరో ఐదుగురు బాధితులు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదటి కేసు పూర్తి శిక్షాకాల పూర్తయిన తర్వాతే రెండో కేసుకు సంబంధించిన 35 ఏళ్ల జైలు శిక్ష మొదలవుతుందని కోర్టు ఆదేశించింది. ఫలితంగా నిందితుడు మను తన జీవితాన్ని మొత్తం జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Friday, June 26, 2026, 17:02 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+