Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: కీర్తి సురేష్

టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని సౌతిండియా టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపింది. ధోనీ అంటే చాలా ఇష్టమని, ఆయనే తన మొదటి క్రష్ అని పేర్కొంది. చిన్ననాటి నుంచి ధోనీని ఆరాధిస్తున్నానని, ఆయన లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా ఉండేదని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ టాప్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే ఓటీటీ టాక్‌షోకు ముఖ్య అతిథిగా హాజరైన కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే హోస్ట్ జగపతి బాబు ఫేవరేట్ క్రికెటర్ గురించి ప్రశ్నించగా.. ధోనీ పేరు చెప్పింది. గతంలో ఓ ఇంటరాక్టివ్ సెషన్‌లోనూ అభిమాన క్రికెటర్ గురించి ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. ధోనీ పేరును చెబుతూ 'తమ్బి, నమ్మ 7 ఎల్లప్పుడూ!'అని పేర్కొంది. ధోనీ జెర్సీ నెంబర్ 7 అన్న సంగతి తెలిసిందే.

Keerthy Suresh Reveals Her Favourite Cricketer
Photo Credit: Screengrab from @ZeeCinemalu

కేరళకు చెందిన కీర్తి సురేష్ ఫ్యామిలీ తమిళనాడులో సెట్ అయ్యింది. తమిళనాడు ప్రజలకు సహజంగానే ధోనీ అంటే పిచ్చి. ఆ క్రమంలోనే కీర్తి సురేష్ కూడా ధోనీకి ఫ్యాన్ అయ్యింది. మహేంద్ర సింగ్ ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైమ్‌లో ధోనీని చూసేందుకే అభిమానులు స్టేడియానికి వస్తారు.

ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడ సీఎస్‌కే మ్యాచ్‌లు జరిగినా స్టేడియాలు పసుపు మయం అవుతాయి. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనీ.. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికాడు. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్.. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తుంది. హిందీలో బేబీ జాన్, తమిళ చిత్రాలు రివాల్వర్ రీటా, కన్నెవీడి వంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన ఆంటోనీ తట్టిల్‌ను కీర్తి సురేష్ ప్రేమ వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది.

Story first published: Friday, October 17, 2025, 15:14 [IST]
Other articles published on Oct 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+