For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Keegan Petersen: నా కెరీర్‌లో టీమిండియాదే బెస్ట్ బౌలింగ్! మా బిగ్ వికెట్ అతనే!

Keegan Petersen says India Pace Attack is Most Challenging In My Whole Career

కేప్‌టౌన్‌: ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎదుర్కొన్న బౌలింగ్‌లో టీమిండియాదే అత్యుత్తమని సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ కీగన్ పీటర్సన్ అన్నాడు. భారత్‌తో జరుగుతున్న కీలక మూడో టెస్ట్‌లో బ్యాట్స్‌మన్ అంతా విఫలమైన వేళ పీటర్సన్(72) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ విలువైన పరుగులు చేశాడు. టీమిండియా తరఫున కోహ్లీ ఎలా ఓపికగా ఆడాడో.. సఫారీ తరఫున పీటర్సన్ అదే తరహా ప్రదర్శన కనబర్చి భారీ ఆధిక్యాన్ని అడ్డుకున్నాడు.

భారత్‌దే మేటీ బౌలింగ్..

భారత్‌దే మేటీ బౌలింగ్..

ఇక రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ కీగన్ పీటర్సన్ టీమిండియా పేస్ విభాగంపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ శక్తి సామర్థ్యాలకు తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. 'భారత పేస్‌ బౌలింగ్‌ నాకు సవాలుగా మారింది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఎదుర్కొన్న బౌలింగ్‌లో ఇదే మేటి బౌలింగ్‌ విభాగం అని చెప్పొచ్చు. మన ఆటపై పూర్తిగా దృష్టి సారించాలి. లేకపోతే వాళ్లు అస్సలు వదలరు. పరుగుల పరంగా కూడా టీమిండియా పేసర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ సహనాన్ని పరీక్షిస్తారు.

మూడో స్థానంలో..

మూడో స్థానంలో..

ఈ పిచ్‌పై పరుగులు చేసే అవకాశాలు పెద్దగా లేవు. వాళ్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్‌ విభాగాల్లో ఒకరు. ఈ సిరీస్‌కు రాకముందే భారత పేసర్లు సవాళ్లు విసురుతారని తెలుసు. దాంతో పోరాడాల్సిందేనని నిర్ణయించుకున్నాం.'అని చెప్పుకొచ్చాడు. అనంతరం తన బ్యాటింగ్‌ స్థానంపై మాట్లాడిన పీటర్సన్‌.. తన కెరీర్‌లో అత్యధిక శాతం మూడో నంబర్‌ ఆటగాడిగా బ్యాటింగ్‌ చేసినట్లు గుర్తుచేసుకున్నాడు. అలాగే తమ ఓపెనర్లు విఫలమవ్వడం పై స్పందిస్తూ.. మార్‌క్రమ్‌, ఎల్గర్‌ నాణ్యమైన ఆటగాళ్లని, ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పాడు. వాళ్లు తిరిగి రాణిస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఇప్పుడు తాను నాలుగో నంబర్‌ ఆటగాడిగా రావడం గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. అయితే, మూడో నంబర్‌ ఆటగాడిగా బరిలోకి దిగితే సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు.

కోహ్లీని ఔట్ చేస్తే..

కోహ్లీని ఔట్ చేస్తే..

ఈ మ్యాచ్‌లో తాము గెలవాలంటే మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఔట్ చేయాలని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 'రేపు ఉదయమే భారత ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వికెట్లు తీయాలి. గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా ఈ ఇద్దరూ తమకు తలనొప్పిగా మారారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని ఔట్ చేయడం మాకు చాలా ముఖ్యం. అతను వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్. అతను క్రీజులో నిలదొక్కుకుంటే అడ్డుకోవడం కష్టం. అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయడమే మా టార్గెట్'అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

రిషభ్ పంత్ సెంచరీ..

రిషభ్ పంత్ సెంచరీ..

ఇక 57/2 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా(9).. పీటర్సన్ సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరగ్గా.. ఆ మరుసటి ఓవర్‌లోనే రహానే(1) క్యాచ్ ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(51 బ్యాటింగ్)తో విరాట్ కోహ్లీ(28 బ్యాటింగ్) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడగా.. విరాట్ డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. ఈ క్రమంలో పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. 4 వికెట్లకు 130 పరుగులు చేసింది.

Story first published: Thursday, January 13, 2022, 16:40 [IST]
Other articles published on Jan 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+