సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కావ్య మారన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన సొంతగడ్డపై ఈ మ్యాచ్ జరిగినందుకో లేక మరే కారణమో తెలియదో కానీ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడు.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసిన కావ్య పాప.. క్యాచ్‌లు వదిలేసినప్పుడు.. బ్యాటర్లు విఫలమైనప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కావ్య పాప నవరసాలు..
ఈ మ్యాచ్‌లో తన హవాభావాలతో నవరసాలు పండించింది. ప్రస్తుతం ఆమె రియాక్షన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీమర్స్ ఫన్నీ కామెంట్స్‌తో మీమ్స్ ట్రెండ్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. ముఖ్యంగా కామింద్ మెండీస్.. ఫ్రీ హిట్ బాల్‌ను వదిలేయడంపై కావ్య మారన్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. తన ముఖ కవలికలతోనే అసహనం వ్యక్తం చేసింది. 'అయ్యో వీడు ఉట్టి దద్దమ్మ లా ఉన్నాడే'అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అంతకుముందు కామిందు మెండీస్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పుడు వారెవ్వా వాటే క్యాచ్ అంటూ కావ్య పాప రియాక్షన్ ఇచ్చింది. ఇక హర్షల్ పటేల్ క్యాచ్ వదిలేయడంపై వైల్డ్‌గా రియాక్ట్ అయ్యింది. గట్టిగా అరుస్తూ బూతులు తిట్టింది.
12 ఏళ్ల తర్వాత విజయం..
ఈ మ్యాచ్‌లో కామిందు మెండీస్ ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్‌కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చెన్నై గడ్డపై ఆరెంజ్ ఆర్మీ విజయం సాధించింది.
Kavya Maran's reaction when Kamindu missed a free hit.💀#CSKvsSRH pic.twitter.com/YKLMI3CKGQ
— 𝐑𝐔𝐌𝐈𝐈 ᵗᵒˣⁱᶜ|ʳᵉᵇᵉˡ🃏 (@Rocky_1661) April 25, 2025