బిలియన్ డాలర్ల సంపదకు ఏకైక వారసురాలు.. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ గురించి తెలియని ఆసక్తికర విషయాలు!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నా ఆ టీమ్ ఓనర్ కావ్య మారనే ప్రేక్షకులను అలరించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్‌కు హాజరైన ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ తన హవాభావాలతో ప్రేక్షకులను అలరించింది.
ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కనీసం మా కావ్య పాప కోసమైనా మ్యాచ్ గెలవండ్రా అని ఆ టీమ్ ఫ్యాన్స్ కోరెంత కనెక్ట్ అయ్యారు. హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే అందరి చూపులు కావ్య మారన్‌పైనే. ఆమె కోసమే మ్యాచ్ చూసేవాళ్లు ఉన్నడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బిజినెస్‌పై ఆసక్తితో..
సినీ హీరోయిన్‌ను తలపించే లుక్‌తో ఇంతటి పాపులారిటీ సంబంధించిన ఈ సన్‌రైజర్స్ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. బిజినెస్ మీద ఆసక్తితో కావ్య ఎంబీఏ చేసింది. ఏవియేషన్, మీడియా అంటే ఆమెకు చాలా ఇష్టం. దాంతో తన తండ్రి బిజినెస్‌ల్లోని సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్‌ను చూసుకుంటుంది. త్వరలో సన్‌గ్రూప్‌ను టేకప్ చేయబోతుంది.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్..
కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసియాలోనే నెంబవర్ వన్ టీవీ నెట్ వర్క్ సంస్థను స్థాపించారు. కావ్య వాళ్లది బిజినేస్ కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్, డీఎంకే పార్టీ నుంచి యూనియన్ మినిస్టర్‌గా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్‌సభ ఎంపీ. తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య.

టీవీఎస్ ఓనర్స్‌తో..
2015లో టీవీఎస్ సంస్థ యాజమాని కుటుంబంతో కావ్య పెళ్లి అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని రోజులు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పెళ్లి ఆగిపోయింది. కొన్నిసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను ఎంకరేజ్ చేయడానికి టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ స్టేడియానికి వస్తే కావ్యతో లవ్‌లో ఉన్నాడనే రూమర్స్ హల్‌చల్ చేశాయి. కానీ అవేవి నిజం కావని, ఆమె తనకు మంచి స్నేహితురాలే విషయం అఖిల్-శ్రేయా భూపాల్ నిశ్చితార్థంతో స్పష్టమైంది. అయితే ఇప్పుడు కావ్యకు తమిళనాడుకు చెందిన బిజినెస్ ఫ్యామిలీతో కానీ, డీఎంకే పార్టీ కుటుంబాలకు చెందిన వారితో కానీ పెళ్లి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బిలియన్ డాలర్ల వారసురాలు..
సన్‌గ్రూప్‌లో జెమీనీతో పాటు అనేక భాషల్లో చాలా చానెళ్లు ఉన్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినదే. రెడ్ ఎఫ్‌ఎంతో పాటు ఇండియా మొత్తం 70 రెడియా స్టేషన్లు ఉన్నాయి. రోబో సినిమా నిర్మించిన సన్ పిక్ఛర్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే. స్పైస్ జెట్‌లో కూడా 40 శాతం వాటా ఉండేది. కానీ ఆ వాటాను స్పైస్ జెట్ ఓనర్ అజయ్ సింఘ్‌కేఅమ్మేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. అతని నెట్ వర్త్ 2021 ప్రకారం 2.3 బిలియన్ డార్లుగా ఉంటుందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ 2.3 బిలియర్ డాలర్ల ఆస్థికి ఏకైక వారసురాలు కావ్యమారనే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications