Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!

ఐపీఎల్ 2027 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కోసం కొత్త హెడ్ కోచ్‌ను నియమించాలనే ఆలోచనలో కావ్య మారన్ ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుత హెడ్ కోచ్ డానియల్ వెటోరి పనితీరు పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తదుపరి సీజన్ ప్రారంభానికి ముందే డానియల్ మెటోరిపై వేటు వేసి కొత్త హెడ్ కోచ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుభవజ్ఞుడైన భారతీయ కోచ్‌తో చర్చలు జరుపుతోందని, ఈ వ్యవహారంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని జట్టుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

Kavya Maran Unhappy With Daniel Vettori SRH Planning Big Coaching Overhaul For IPL 2027

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు బ్రియాన్ లారా స్థానంలో డానియల్ వెటోరి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణ, ప్యాట్ కమిన్స్ అద్భుతమైన సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ సీజన్ ఫైనల్ చేరింది. కానీ తుది పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి టైటిల్‌ను చేజార్చుకుంది.

అప్పులున్నాయి కాపాడండి.. లలిత్ మోదీ కాళ్లు పట్టుకున్న స్టార్ క్రికెటర్! ఎవరంటే?

అప్పులున్నాయి కాపాడండి.. లలిత్ మోదీ కాళ్లు పట్టుకున్న స్టార్ క్రికెటర్! ఎవరంటే?

ఐపీఎల్ 2025 సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ప్లే ఆఫ్స్ చేరకుండా ఆరో స్థానంలో నిలిచింది. తాజా సీజన్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

డానియల్ వెటోరి హయాంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన క్రికెట్ శైలి ఐపీఎల్ చరిత్రనే మార్చేసింది. పవర్‌ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే సరికొత్త వ్యూహాన్ని ఆయన జట్టులో నూరిపోశారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి టీ20 క్రికెట్ ఆడే విధానాన్ని మార్చేశారు.

డానియల్ వెటోరి పర్యవేక్షణలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకున్న టైటిల్ దక్కలేదు. వెటోరి రాకముందు 2021, 2022, 2023 సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో నిలిచింది. దాంతోనే కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పడినట్లు అర్థమవుతుంది.

IND vs SL: వైభవ్ సూర్యవంశీ విఫలం!

IND vs SL: వైభవ్ సూర్యవంశీ విఫలం!
Story first published: Tuesday, June 9, 2026, 15:12 [IST]
Other articles published on Jun 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+