Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుమ్మురేపుతున్న కావ్య పాప టీమ్..!

సౌతాఫ్రికా 20 లీగ్‌ 2025- 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ కావ్య పాప్ టీమ్ సత్తా చాటింది. రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

డిసెంబర్ 26న ఈ టోర్నీ ప్రారంభమవ్వగా.. మరుసటి రోజు పార్ల్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారీ విజయంతో ఈ టోర్నీలో శుభారంభం చేసింది.

49 పరుగులకే ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. జోర్డాన్ హెర్మెన్(62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. డికాక్(42) మెరుపులు మెరిపించాడు. అనంతరం పార్ల్ రాయల్స్ 11.5 ఓవర్లలోనే 49 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్రిచ్ నోర్జ్(4/13) నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే, తారింధు రత్‌నాయకే రెండేసి వికెట్లు పడగొట్టారు.

Kavya Maran s SRH Eastern Cape Continue Winning Streak in SA20 2025 26 Season

క్యాపిటల్స్ చిత్తు..

సోమవారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. డికాక్(77), బ్రిట్జ్‌కే(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

అనంతరం ప్రిటోరియా క్యాపిటల్స్ 18 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఆడమ్ మిల్నే నాలుగు వికెట్లు తీయగా.. రత్‌నాయకే రెండేసి వికెట్లు పడగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కావ్య పాప టీమ్‌కు తిరుగులేదని, సన్‌రైజర్స్ తమ్ముడు దుమ్మురేపుతున్నాడని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వరుసగా రెండు సీజన్లలో..

అరంగేట్ర SA20 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్.. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ముచ్చటగా మూడో సీజన్‌లో ఫైనల్ చేరి టైటిల్ గెలవాలనే కసితో ఉంది. మరికాసేపట్లో పార్ల్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తమ మూడో మ్యాచ్ ఆడనుంది.

Story first published: Wednesday, December 31, 2025, 14:31 [IST]
Other articles published on Dec 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+