Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రేయ్ ఎవడ్రా వాడు.. మా కావ్య పాపకే పువ్వు ఇచ్చాడు!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో తమ పరాజయాల పరంపరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బ్రేక్ వేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయాన్నందుకుంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను 57 పరుగులతో చిత్తు చేసింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

ఈ మ్యాచ్‌ను ఆస్వాదించి కావ్య మారన్.. మైదానంలో తన హావభావాలతో సందడి చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్ల బౌండరీలు బాదినప్పుడు, బౌలర్లు వికెట్లు తీసినప్పుడు ఎగిరి గంతేసిన కావ్య మారన్..బ్యాటర్లు ఔటైనప్పుడు, బౌండరీలు సమర్పించుకున్నప్పుడు మాత్రం బుంగమూతి పెట్టి నిరాశగా కనిపించింది.

Kavya Maran Receives Flowers from Fan After SRH s Convincing Win Over RR Viral Video Captures Heartwarming Moment
Photo Credit: screen grab for X Video

ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అద్భుత బౌలింగ్‌తో వికెట్లు తీసినప్పుడు కావ్య మారన్ సంతోషానికి హద్దేలేకుండా పోయింది. తన పక్కన ఉన్నవారిని హగ్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరూ యువ పేసర్లు నాలుగేసి వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లను ఔట్ చేస్తే గెలుస్తామనే వ్యూహంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఈ యువ పేసర్లు ఔటాఫ్ సిలబస్‌లా దిమ్మతిరిగే షాకిచ్చారు.

ముఖ్యంగా ప్రఫుల్ హింగే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి సరికొత్త చరిత్రను లిఖించడంతో పాటు రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. అతని ధాటికి వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌కు కావ్య మారన్‌తో పాటు ఆమె తండ్రి కళానిధి మారన్, కావేరి మారన్ కూడా హాజరయ్యారు. ఈ మ్యాచ్ అనంతరం లిఫ్ట్‌లో వారు వెళ్లిపోతుండగా.. ఓ అభిమాని కావ్య మారన్‌కు గులాబీ పువ్వు ఇచ్చి మరి అభినందనలు తెలిపాడు. ఆ పువ్వు తీసుకున్న కావ్య మారన్ థ్యాంక్స్ అంటూ సిగ్గు పడిపోయింది. కళానిధి మారన్ కూడా అభిమానుల ప్రేమకు ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై ఫ్యాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. 'రేయ్ ఎవడ్రా వాడు.. మా కావ్య పాపకే పువ్వు ఇచ్చాడు.'అని కామెంట్స్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా కావ్య మారన్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె కోసం మ్యాచ్‌లు చూసే అభిమానులు కూడా ఉన్నారు. సౌతాఫ్రికా 20 లీగ్‌లో అయితే కావ్య మారన్‌ను పెళ్లి చేసుకుంటావా? , ఐలవ్ యూ అనే ప్లకార్డులను కూడా అభిమానులు ప్రదర్శించారు. అంతలా ఆమె క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Tuesday, April 14, 2026, 13:32 [IST]
Other articles published on Apr 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+