ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆట కన్నా ఆ టీమ్ ఓనర్ కావ్య మారనే ప్రేక్షకులను అలరించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. మరో 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు గెలిస్తే కానీ ఆరెంజ్ ఆర్మీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కదు. ప్రస్తుత టీమ్ పరిస్థితి చూస్తుంటే ఇది అసాధ్యమే అనిపిస్తోంది. ఇక ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌కు హాజరైన కావ్య మారన్ తన హవాభావాలతో ప్రేక్షకులను అలరించింది. ఎంతలా అంటే మైదానంలో బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా.. బౌలర్ వికెట్ తీసినా టీవీ కెమెరాలు ఆమెనే పదేపదే చూపించేంత.
జట్టు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆమె కొట్టే కేరింతలు.. ఓడినప్పుడు బుంగ మూతి పెడుతూ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆమె హవాభావాలన్నీ మీమ్స్‌గా నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె బాధలో ఉండటం చూడలేకపోతున్న నెటిజన్లు.. కనీసం కావ్యమారన్ కోసమైనా.. మ్యాచ్ గెలవాలని ఆటగాళ్లను కోరుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ఉందంటే అందరి చూపులు కావ్య మారన్‌పైనే. ఆమె కోసమే మ్యాచ్‌కు వచ్చేవాళ్లు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ హీరోయిన్‌ను తలపించే లుక్‌తో ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ సన్‌రైజర్స్ ఓనర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

మీడియా టైకూన్ కూతురు..
సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ముద్దుల తనయే కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్నించారు. అందరూ ముద్దుగా కావ్య అని పిలుచుకుంటారు. స్టెల్లా మేరిస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పట్టా పొందిన కావ్యమారన్.. వ్యాపారం మీద ఆసక్తితో లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ఏవియేషన్, మీడియా అంటే కావ్యకు చాలా ఇష్టం. కెరీర్ ప్రారంభంలో సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం చానల్స్ వ్యవహారాలను చూసుకుంది. ఆ తర్వాత సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. క్రికెట్ అంటే కావ్యకు చాలా ఇష్టం. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బాధ్యతలను స్వీకరించింది.
రాజకీయ కుటుంబ నేపథ్యం..
కళానిధి మారన్ 1990లో చిన్న మ్యాగజైన్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆసియాలోనే నెంబవర్ వన్ టీవీ నెట్ వర్క్ సంస్థను స్థాపించారు. కావ్య వాళ్లది బిజినేస్ కాకుండా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్. కావ్య వాళ్ల తాత మురసోలి మారన్, డీఎంకే పార్టీ నుంచి యూనియన్ మినిస్టర్‌గా పనిచేశారు. కావ్య వాళ్ల బాబాయి దయానిధి మారన్ మాజీ లోక్‌సభ ఎంపీ. తమిళనాడు మాజీ సీఎం కరుణానిది కావ్య వాళ్ల తాతయ్యకు సొంత మామయ్య.
బిలియన్ డాలర్ల వారసురాలు..
సన్‌గ్రూప్‌లో జెమీనీతో పాటు అనేక భాషల్లో చాలా చానెళ్లు ఉన్నాయి. సన్ డైరెక్ట్ డీటీహెచ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినదే. రెడ్ ఎఫ్‌ఎంతో పాటు ఇండియా మొత్తం 70 రెడియా స్టేషన్లు ఉన్నాయి. రోబో, జైలర్ వంటి పాపులర్ సినిమాలను నిర్మించిన సన్ పిక్ఛర్ ప్రొడక్షన్స్, సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకైక ఓనర్ కళానిధి మారన్. కావ్య మారన్ నెట్ వర్త్ దాదాపు రూ. 409 కోట్లుగా ఉంటుంది. కావ్య మారన్ కుటుంబ నెట్ వర్త్.. దాదాపు రూ. 25వేల కోట్లుగా ఉంటుంది. ఇండియా టాప్ వుమెన్ ఆచివర్స్ జాబితాలో కావ్యమారన్‌కు చోటు దక్కింది. ఫార్చూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ 2025 అవార్డ్ కూడా వరించింది.
కార్లు అంటే మోజు..
కావ్య కార్లు అంటే చాలా ఇష్టం. కావ్య వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ధర రూ. 12.2 కోట్లు. కాగా,. బెంట్లీ బెంటెగా LWB - ధర: రూ. 6 కోట్లు. అదే విధంగా.. బీఎండబ్ల్యూ i7(రూ. 2.13 కోట్లు), ఫెరారీ రోమా( రూ. 3.76) వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. 2015లో టీవీఎస్ సంస్థ యాజమాని కుటుంబంతో కావ్య పెళ్లి అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ వార్తలు ఫేక్ అని తేలింది. కావ్య మారన్ వ్యక్తిగత జీవితం గురించి రోజుకో పుకారు షికార్ చేస్తుంది. తెలుగు హీరో అక్కినేని అకిల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మలతో కావ్య మారన్ డేటింగ్ చేస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా ఫేక్ అని తేలింది. సోషల్ మీడియాకు దూరంగా ఉండే.. కావ్య మారన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. రిలేషన్‌లో ఉన్నట్లు కూడా అధికారికంగా ప్రకటించలేదు.