IPL 2026: క్లాసెన్ ఫ్లయింగ్ కిస్.. షాకైన కావ్య మారన్!(వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతోంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ హ్యాట్రిక్ కొట్టింది. టోర్నీ ఆరంభంలో బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో ఇబ్బంది పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనామక ఆటగాళ్ల అదిరిపోయే ప్రదర్శనతో పటిష్టంగా కనిపిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దూసుకెళ్లింది.
అయితే గత మంగళవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసెన్.. తొలి ఇన్నింగ్స్ అనంతరం ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాడు. క్లాసెన్ చర్యకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ స్టన్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(13 బంతుల్లో 3 ఫోరలు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోర్ అందించాడు. సెంచరీ హీరో అభిషేక్ శర్మ స్లాగ్ ఓవర్లలో తడబడినా.. క్లాసెన్ స్వేచ్ఛగా షాట్స్ ఆడాడు. ఇన్నింగ్స్ అనంతరం మైదానం వీడి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే సమయంలో తన సతీమణి, పిల్లలను చూసిన క్లాసెన్.. చేతులు ఊపుతూ.. వారికి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చాడు.
క్లాసెన్ పిల్లలు కూడా అతనికి బదులుగా ముద్దులిచ్చారు. లవ్‌యూ పప్పా అని గట్టిగా అరిచారు. పక్కనే ఉన్న కావ్య మారన్.. తండ్రిపై పిల్లలకు ఉన్న ప్రేమను చూసి అవాక్కైంది. వారి క్యూట్ రియాక్షన్‌కు ముగ్దురాలైన కావ్య పాప నవ్వుతూ చప్పట్లు కొట్టింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్ 242/2 భారీ స్కోర్ చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 195/9 పరిమితమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో పాట్ కమిన్స్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications