ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-4 బ్యాటర్లు చేతులెత్తేసారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీ అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7), ఇషాన్ కిషన్(1) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ పేసర్ అయిన మహమ్మద్ షమీ.. తన వరుస ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. జట్టును ఆదుకోవాల్సిన కెప్టెన్ ఇషాన్ కిషన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన హెన్రీచ్ క్లాసెన్‌తో రూ.13 కోట్ల ఆటగాడైన లియామ్ లివింగ్ స్టోన్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.
ఆ వెంటనే లివింగ్ స్టోన్‌ను దిగ్విజయ్ రతీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సన్‌రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్ కూడా ఆచితూచి ఆడటంతో సన్‌రైజర్స్ 10 ఓవర్లలో 35 పరుగులే చేసింది.

సాధారణంగా ఉప్పల్ మైదానం అనగానే బ్యాటింగ్ పిచ్‌ను అంచనా వేసే అభిమానులు.. 300 లోడింగ్ అంటూ సందడి చేశారు. కానీ తీరా మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో మౌనంగా ఉండిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబా ఓనర్ కావ్య మారన్ అయితే తీవ్ర అసహనానికి గురయ్యారు. 'ఇయ్యాల.. మీకు ఏం పుట్టింది రా అయ్యా..!'అనే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. అభిమానులు కూడా సన్‌రైజర్స్ బ్యాటర్లపై సోసల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
కాటేరమ్మ కొడుకులు కాదు.. శాతగాని కొడుకులని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బ్యాటింగ్ పిచ్‌లపై మాత్రమే ఆడే వీళ్లేం ఆటగాళ్లని మండిపడుతున్నారు. మొత్తానికి సన్‌రైజర్స్ బ్యాటర్ల వైఫల్యంతో ఉప్పల్ మైదానం మొత్తం సైలెన్స్‌గా మారింది. ఒక్కడైనా సిక్సర్ కొట్టండ్రా? అని ఫ్యాన్స్ దిగాలుగా చూస్తున్నారు.
పిచ్ నుంచి లభించిన సహకారంతో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తేలిపోయిన మహమ్మద్ షమీ.. ఈ మ్యాచ్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్‌లో డేంజరస్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఔటయ్యారు. సాధారణంగా ఉప్పల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లు ఉంటాయి. కానీ మధ్యాహ్నం మ్యాచ్ కావడం.. పిచ్‌పై నీళ్లు ఎక్కువగా చల్లకపోవడంతో స్లో వికెట్‌గా మారిందని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. లక్నో బ్యాటింగ్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని చెబుతున్నారు. సన్‌రైజర్స్ ప్రధాన బలం బ్యాటింగ్ అయినప్పటికీ.. స్లో వికెట్ తయారు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.