Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 Final: తళుక్కుమన్న కావ్య పాప!

సౌతాఫ్రికా20 లీగ్ 2025 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ తళుక్కుమన్నది. ఈ టోర్నీలో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మూడో టైటిల్‌పై కన్నేసింది. జట్టుకు అండగా నిలిచేందుకు ఈ మ్యాచ్‌కు కావ్య మారన్ హాజరైంది. ముంబై ఇండియన్స్ కేప్ టౌన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ కేప్‌టౌన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ ముందు 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఎంఐ కేప్‌టౌన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38), కొన్నోర్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), ర్యాన్ రికెల్టన్(15 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 33) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్(2/39), రిచర్డ్ గ్లీసన్(2/22), లియామ్ డాసన్(2/40) రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్, క్రైగ్ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.

Kavya Maran Cheers for Sunrisers Eastern Cape in 2025 SA20 Final

ఈ టోర్నీ మొత్తానికి దూరంగా ఉన్న కావ్య మారన్.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం హాజరయ్యారు. టీమ్‌కు దగ్గరుండి సపోర్ట్ చేశారు. వికెట్ తీసినప్పుడు ఎగిరి గంతేసిన కావ్య పాప్.. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ షాట్లు ఆడినప్పుడు మాత్రం నిరాశగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం కావ్యమారన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. కావ్యమారన్‌తో పాటు ఆమె తండ్రి కళానిధి మారన్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు.

హ్యాట్రిక్ ఓటములతో ఈ టోర్నీని ప్రారంభించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రయాణం.. పడుతూ లేస్తూ సాగింది. అనూహ్య పరిస్థితుల్లో కీలక మ్యాచ్‌‌లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న సన్‌రైజర్స్.. అసాధారణ ప్రదర్శనతో ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2లో పార్ల్ రాయల్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు క్వాలిఫయర్-1లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్.. పార్ల్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

Story first published: Saturday, February 8, 2025, 22:20 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+