Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించడంతో పాటు రికార్డుల మోత మోగిస్తోంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా గెలుపొందింది. ఓడిపోయిన రెండు మ్యాచ్‌ల్లోనూ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. కేకేఆర్‌తో 4 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Kaviya Maran so happy for SRH performance in IPL 2024

గత మూడు సీజన్లలో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సారి మాత్రం దుమ్మురేపుతోంది. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. మూడింటిలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కానుంది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు ఆ జట్టును పూర్తి ప్రక్షాళన చేశారు. హెడ్ కోచ్‌తో పాటు ఆటగాళ్లను మార్చేసారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం రూ. 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ విన్నర్ ట్రావిస్ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు తీసుకుంది. కమిన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కోట్లు కుమ్మరించడం చూసి అంతా నవ్వుకున్నారు. కావ్య పాపకు పిచ్చా? అని ట్రోల్ చేశారు. జట్టులో నలుగురే విదేశీ ఆటగాళ్లు ఆడుతారనే విషయం కావ్య పాకు తెలియనట్లుందని ఎగతాళి చేశారు.

Kaviya Maran so happy for SRH performance in IPL 2024

కానీ కమిన్స్, ట్రావిస్ హెడ్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే పూర్తిగా మారిపోయింది. ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండగా.. ప్యాట్ కమిన్స్ తన సూపర్ కెప్టెన్సీతో పాటు బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. ఈ ఇద్దరి సూపర్ పెర్ఫామెన్స్‌తో జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతీ మ్యాచ్ సంచలనంగా మారుతోంది.

ఇప్పటికే 288, 273 పరుగుల భారీ లక్ష్యాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డుల నమోదు చేసింది. గత నాలుగేళ్లుగా సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురైన కావ్య పాప.. ఇప్పుడు ప్రతీ మ్యాచ్‌లో ఎగిరి గంతేస్తుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోరుకున్నట్లు కావ్య పాప ముఖంలో చిరనవ్వు చెరగడం లేదు. దాంతో అప్పుడు కావ్య పాపను చూసి అందరూ నవ్వుకున్నారని, ఇప్పుడు ఆమె నవ్వుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, April 25, 2024, 16:57 [IST]
Other articles published on Apr 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+