Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు టైటిళ్లు అసాధారణం.. మా వాళ్లు మంచి ఆటగాళ్లు: కావ్య మారన్ (వీడియో)

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలవడంపై ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ సంతోషం వ్యక్తం చేసింది. వరుసగా రెండు టైటిళ్లు గెలవడం అసాధారణమని తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించింది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగులతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

ఈ మ్యాచ్‌కు హాజరైన కావ్య మారన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ ఆసాంతం తన జట్టుకు మద్దతు తెలుపుతూ గ్యాలరీలో సందడి చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీలు బాదినప్పుడు.. బౌలర్లు వికెట్లు తీసినప్పుడు ఎగిరి గంతేసింది. చిరునవ్వులతో అభిమానుల మనసులను గెలుచుకుంది. కెమెరామన్ పూర్తిగా కావ్యమారన్‌పై ఫోకస్ పెట్టాడు.

Kaviya Maran says its unbelievable to be winning back to back titles After Sunrisers Win SA20 2024

బౌండరీ బాదినా.. వికెట్ తీసినా.. కావ్య మారన్ రియాక్షన్‌ను చూపించాడు. ఈ విజయానంతరం కావ్య మారన్.. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడింది. ఆమె మీడియా ముందుకు రావడం చాలా తక్కువ. కనీసం సోషల్ మీడియా కూడా ఉపయోగించదు. అలాంటి కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రెండో టైటిల్ గెలిచిన వెంటనే.. సంతోషాన్ని ఆపుకోలేక కెమెరా ముందుకు వచ్చి తన ఆనందాన్ని పంచుకుంది.

'ఇది మాకు రెండో టైటిళ్లు. వరుసగా రెండు ట్రోఫీలు గెలవడం చాలా సంతోషంగా ఉంది. బ్యాట్, బంతితో మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. సమష్టి ప్రదర్శనలతో ఈ సీజన్‌ మొత్తం ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు ఇదే ఆటతీరును కొనసాగించి టైటిల్ అందుకుంది. వరుసగా రెండు టైటిళ్లు అందుకోవడం అసాధారణం. ఈ విజయం పట్ల కుర్రాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారు. బలమైన జట్టుతోనే తలపడ్డాం. చివరకు విజయాన్ని అందుకోని ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉంది.'అని కావ్య మారన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మామ(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), జోర్డాన్ హెర్మెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) మెరుపులు మెరిపించారు.

డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ మార్కో జాన్సెన్(5/30)సంచలన ప్రదర్శనతో 115 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. జాన్సెన్‌తో పాటు డానియల్ వోర్రల్, బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీయగా.. సిమన్ హార్మర్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, February 11, 2024, 8:32 [IST]
Other articles published on Feb 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+