Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 Final: కంటతడి పెట్టిన కావ్య మారన్(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయంతో ఆ జట్టు ఓనర్ కావ్యా మారన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టు.. కీలక పోరులో కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కావ్య మారన్ తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IPL 2024 Final లో SRH ఓడిపోయాక Kavya Maran రియాక్షన్ వైరల్ | Telugu Oneindia

ఈ మ్యాచ్ మధ్యలోనే ముఖం చాటేసిన కావ్యమారన్.. కేకేఆర్ విజయానంతరం మళ్లీ స్టాండ్స్‌లోకి వచ్చింది. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించింది. ఈ క్రమంలోనే ఓటమిని తట్టుకోలేక కావ్య మారన్ కన్నీటిపర్యంతమైంది.

Kaviya Maran in Tears After KKR beat SRH in IPL 2024 Final Video Goes Viral

ఈ వీడియోను చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. 'ధైర్యంగా ఉండండి మేడమ్'అంటూ కామెంట్ చేస్తున్నారు. సీజన్ మొత్తం తమ అసాధారణ ప్రదర్శనతో కావ్యను నవ్వించిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. కీలక పోరులో మాత్రం తీవ్రంగా నిరాశపరిచి ఏడిపించారని, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని విమర్శిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20)‌, ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) సత్తా చాటారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీ ఆసాంతం కేకేఆర్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను మట్టికరిపించిన కేకేఆర్ ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది.

Story first published: Sunday, May 26, 2024, 22:54 [IST]
Other articles published on May 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+