Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA20 ఛాంపియన్ సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య మారన్! (వీడియో)

సౌతాఫ్రికా టీ20 లీగ్ సెకండ్ సీజన్‌ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ సొంతం చేసుకుంది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా రెండో టెటిల్ గెలిచి ఈ టోర్నీలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగులతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ మామ(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), జోర్డాన్ హెర్మెన్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42) మెరుపులు మెరిపించారు.

Kaviya Marans Celebration After Sunrisers Eastern Cape Win SA20 2024 Title Goes Viral

డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ మార్కో జాన్సెన్(5/30)సంచలన ప్రదర్శనతో 115 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. జాన్సెన్‌తో పాటు డానియల్ వోర్రల్, బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీయగా.. సిమన్ హార్మర్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ మ్యాచ్ ఆసాంతం తన చేష్టలతో గ్యాలరీలో సందడి చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య మారన్ సంబరాలు చేసుకుంది . చాలా హుషారుగా కనిపించిన ఆమె.. జట్టును తనదైన శైలిలో ఛీర్ చేసింది.

బౌలింగ్‌లోనూ వికెట్లు తీసినప్పుడు పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేసింది. కావ్య మారన్ ప్రతీ రియాక్షన్‌ను టీవీ కెమెరామెన్ ప్రేక్షకులకు చూపించాడు. ప్రస్తుతం కావ్యమారన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విజయానందంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన కావ్య మారన్ వరుసగా రెండు టైటిళ్లు గెలవడం చాలా సంతోషంగా ఉందని, తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడింది.

Story first published: Sunday, February 11, 2024, 7:55 [IST]
Other articles published on Feb 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+