For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్‌ను టీమిండియా భవిష్యత్తుగా చూస్తున్నాం.. భువిలాగే దీపక్‌ బౌలింగ్ చేస్తున్నాడు

IND V WI 2019, 3rd T20I : Virat Kohli Says 'We Look At Rishabh Pant As The Future' | Oneindia Telugu
India vs West Indies 2019: We look at Rishabh Pant as the future says Virat Kohli

గయానా: యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ను టీమిండియా భవిష్యత్తుగా చూస్తున్నాం. అతనికి తగినన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఇన్నింగ్స్ ఆరంభంలో దీపక్‌ చాహర్‌ కూడా భువనేశ్వర్‌ లాగేనే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), విరాట్‌ కోహ్లీ (52; 45బంతుల్లో 6×4) అర్ధ శతకాలతో చెలరేగడంతో మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఎక్కువ అవకాశాలు ఇస్తాం:

ఎక్కువ అవకాశాలు ఇస్తాం:

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'రిషబ్‌ పంత్‌ను టీమిండియా భవిష్యత్తుగా చూస్తున్నాం. అతనిలో ఎంతో నైపుణ్యం, ప్రతిభ ఉంది. అతడి ఫినిషింగ్‌ తీరు, మ్యాచ్‌ గెలిపించే విధానమే నిదర్శనం. అతనికి తగినన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఇప్పుడే ఒత్తిడి పెంచకూడదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడితో ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. అందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. పంత్‌ ఇలాగే ఆడితే.. భారత్‌కు మరో అత్యుత్తమ క్రికెటర్‌ అవుతాడు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

భువిలాగే దీపక్‌:

భువిలాగే దీపక్‌:

దీపక్‌ చాహర్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'దీపక్‌, భువనేశ్వర్‌ ఇద్దరూ ఒకటే. కొత్త బంతితో భువిలాగే దీపక్‌ ఆడగలడు. కొత్త బంతితో దీపక్‌ ప్రమాదకారి. తన స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ప్రమాదంలోకి నెట్టగలడు. ఐపీఎల్-12లో కూడా అతని ప్రదర్శన బాగుంది' అని కోహ్లీ తెలిపాడు. దీపక్‌ చాహర్‌ ఐపీఎల్-12లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చెన్నై ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

3 ఓవర్లు.. 4 పరుగులు:

3 ఓవర్లు.. 4 పరుగులు:

మూడో టీ20లో దీపక్‌ తన తొలి ఓవర్లోనే ఓపెనర్ సునీల్ నరైన్‌ (2) వికెట్‌ తీసాడు. రెండో ఓవర్‌లో అద్భుతంగా వేశాడు. మరో ఓపెనర్ లూయిస్‌ (10), హెట్‌మైర్‌ (1)లను ఎల్బీడబ్ల్యూలుగా ఔట్‌ చేయడంతో పాటు మెయిడిన్‌గా ముగించాడు. ఇక మూడో ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన దీపక్‌.. 3-1-4-3 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. ఇంత అద్భుత స్పెల్‌ తర్వాత కూడా కెప్టెన్ కోహ్లీ అతనికి మరో ఓవర్‌ ఇవ్వకపోవడం విశేషం.

రాహుల్‌ చహర్‌ అరంగేట్రం.. టీ20ల్లో అరుదైన రికార్డు

చహర్‌ అరంగేట్రం:

చహర్‌ అరంగేట్రం:

2019 ఐపీఎల్‌లో అదరగొట్టడంతో యువ లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది. సీనియర్ రవీంద్ర జడేజా స్థానంలో రాహుల్‌ జట్టులోకి వచ్చాడు. దీంతో టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 81వ క్రికెటర్‌గా రాహుల్‌ చాహర్‌ గుర్తింపు పొందాడు. టాస్‌ వేయడానికి ముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేతుల మీదుగా జట్టు సభ్యులు అందరి సమక్షంలో రాహుల్‌ టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. ఈ సందర్భంగా అందరు అతన్ని అభినందించారు.

Story first published: Wednesday, August 7, 2019, 13:07 [IST]
Other articles published on Aug 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+