Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన కరుణ్ నాయర్..!

టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అజేయంగా నిలుస్తూ అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ శతకాలు సాధించడం ద్వారా కరుణ్ నాయర్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ టోర్నీలో విదర్భ జట్టుకు సారథ్యం వహిస్తున్న కరుణ్ నాయర్..శుక్రవారం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్ ఏ క్రికెట్‌లో నాటౌట్‌గా నిలుస్తూ 542 పరుగులు చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్(527) పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు.

Karun Nair creates history breaks world record with third consecutive century in Vijaya Hazare

గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ కరుణ్ నాయర్ నాటౌట్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌తో 112 నాటౌట్, చత్తీస్ గడ్‌పై 44 నాటౌట్, చండీగడ్‌పై 168 నాటౌట్, తమిళనాడుపై 111 నాటౌట్ సత్తా చాటాడు. కరుణ్ నాయర్ సూపర్ బ్యాటింగ్‌తో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

కరుణ్ నాయర్ 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనికి అవకాశాలు రాలేదు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అన్‌సోల్డ్‌గా నిలిచాడు. ఇటీవల ముగిసిన మేలంలో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది.

Story first published: Friday, January 3, 2025, 20:30 [IST]
Other articles published on Jan 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+