For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs MI మ్యాచ్ మధ్యలో కరుణ్ నాయర్ X బుమ్రా గొడవ..!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిదంటే..?
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఔటాఫ్ సిలబస్‌గా బరిలోకి దిగి ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొట్టాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ అలవోకగా సిక్సర్లు బాదాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్‌లో రెండు బౌండరీలతో 11 పరుగులు పిండుకున్న కరుణ్ నాయర్.. అతను వేసిన 6వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 18 పరుగులు పిండుకొని 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

Karun Nair And Jasprit Bumrah Involved In Heated Spat During DC vs MI IPL 2025 Clash
Photo Credit: screen grab for JioHotstar

ఢీకొట్టాడని గొడవ..
ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఈ ఓవర్‌లో రన్ తీసే క్రమంలో కరుణ్ నాయర్.. చూసుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. వెంటనే అతనికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ బౌండరీలు బాదడనే ఫ్రస్టేషన్‌తో కరుణ్ నాయర్‌పై బుమ్రా నోరు పారేసుకున్నాడు. ఈ ఎక్స్‌ట్రాలే వద్దురోయ్ అని వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. దాంతో ఆగ్రహానికి గురైన కరుణ్ నాయర్ ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్ జోక్యం చేసుకొని బుమ్రాకు సర్ది చెప్పాడు. కరుణ్ నాయర్ తన తప్పులేదని హార్దిక్ పాండ్యాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు ఈ గొడవ జరుగుతుండగా..రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్‌తో నవ్వులు పూయించాడు. రోహిత్ రియాక్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ముంబై థ్రిల్లింగ్ విక్టరీ..
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కరుణ్ నాయర్(40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89) పోరాటం వృథా అయ్యింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌‌లో చివరి మూడు బంతులకు వరుసగా అషుతోష్ శర్మ(17), కుల్దీప్ యాదవ్(1), మోహిత్ శర్మ(0) రనౌటవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది.

Story first published: Monday, April 14, 2025, 0:28 [IST]
Other articles published on Apr 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+