దేశవాళీ అండర్-19 క్రికెట్ టోర్నీ కూచ్ బెహార్ ట్రోఫీలో సంచలన రికార్డు నమోదైంది. కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది అసాధారణ బ్యాటింగ్‌తో రికార్డ్ క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేశాడు. ముంబై జట్టుతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రఖర్ చతుర్వేది తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తం 638 బంతులు ఆడిన ప్రఖర్ చతుర్వేది 46 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు.
కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్లో క్వాడ్రాపుల్ సెంచరీ బాదిన ఏకైక బ్యాటర్‌గా ప్రఖర్ చతుర్వేది చరిత్రకెక్కాడు. తన అసాధారణ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో విజేతగా నిలబెట్టి.. కూచ్ బెహార్ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు.

కేఎస్‌సీఏ నావులే స్టేడియం వేదికగా సోమవారం ముగిసిన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 113.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌటైంది. ఆయూష్(145) సెంచరీతో రాణించగా.. సచిన్ వర్తక్(73) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. ప్రఖర్ చతుర్వేది క్వాడ్రాపుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 223 ఓవర్లలో 8 వికెట్లకు 890 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 510 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. చివరి రోజు కర్ణాటక డిక్లేర్ ఇవ్వడం.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం అందుకున్న కర్ణాటకను విజేతగా ప్రకటించారు. దాంతో ఆ జట్టు కూచ్ బెహార్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రఖర్ చతుర్వేది క్వాడ్రాపుల్ సెంచరీ భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అతనిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.