Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా కొడుక్కి ఆ క్రికెటర్ అంటే పిచ్చి: కరీనా కపూర్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే తన కొడుకు తైమూర్‌కు పిచ్చి అని బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తెలిపింది. ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడని, అతని ఫోన్ నంబర్ ఉందా? అని ప్రశ్నిస్తుంటాడని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. సినిమా స్టార్లు, యాక్టింగ్‌పై తైమూర్‌ ఏ మాత్రం ఆసక్తి చూపడని, కానీ కోహ్లీ, రోహిత్, లియోనల్ మెస్సీల గురించి మాత్రం తరుచూ అడుగుతుంటాడని కరీనా కపూర్ పేర్కొంది.

తాజాగా తన ఆడపడుచు (భర్త సైఫ్ అలీ ఖాన్ సోదరి) సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌కు హాజరైన కరీనా కపూర్.. తైమూర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తైమూర్‌కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

స్పోర్ట్స్ స్టార్స్ గురించే అడుగుతాడు..

'యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ అవుతావా? అంటే తైమూర్ నో చెప్పేవాడు. ఒకసారి ప్రయత్నించి చూడంటే.. లేదమ్మా.. నేను యాక్టింగ్‌ను ఆస్వాదించలేనని చెప్పేవాడు. అందుకే మేం కూడా వాడిని బలవంతం చేయడం లేదు.

తైమూర్.. ఎప్పుడూ నటులు, సినిమా స్టార్లు, మ్యూజిక్ గురించి ఏమీ అడగలేదు. కానీ ప్రతీసారి విరాట్ కోహ్లీ గురించి అడుగుతూ ఉంటాడు. నేను విరాట్ కోహ్లీకి మెసేజ్ చేయవచ్చా..? అతను రిప్లే ఇస్తాడా? నీ దగ్గర కోహ్లీ నెంబర్ ఉందా? అని ప్రశ్నిస్తుంటాడు.

Kareena Kapoor Reveals Her Son Taimur s Favourite Indian Cricketer

కోహ్లీ నెంబర్ ఉందా? అని అడుగుతాడు

కోహ్లీతో పాటు రోహిత్ శర్మ నీకు ఫ్రెండ్సెనా? వాళ్ల బ్యాట్‌ను నాకు గిఫ్ట్‌గా ఇవ్వమని మెసేజ్ చేస్తావా? లియోనల్ మెస్సీ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? అని అడుగుతుండేవాడు. వాళ్ల నెంబర్లు నా దగ్గర లేవని చెప్పేవాడిని. వానికి సినిమాలు, సినిమా యాక్టర్ల గురించి ఏ మాత్రం తెలియదు. ఎప్పుడూ స్పోర్ట్స్ స్టార్స్ గురించే అడుగుతుంటాడు.' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.

తాతా వారసత్వాన్ని..

ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌ కాగా.. జీన్స్ ఎక్కడి పోతాయని, తాతా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ వారసత్వాన్ని తైమూర్ కొనసాగిస్తాడేమోనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ టీమిండియా మాజీ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. టైగర్ పటౌడీ అని అతన్ని ముద్దుగా పిలుచుకునేవారు. భారత్ తరఫున 46 టెస్ట్‌లు ఆడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 6 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలతో 2793 పరుగులు చేశాడు. ఆయన తర్వాత వారుసులెవ్వరూ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోలేదు. తైమూర్ .. తాతా వారసత్వాన్ని కొనసాగిస్తాడేమో చూడాలి.

కరీనా కపూర్‌ను సైఫ్ అలీ ఖాన్ 2012లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016లో తైమూర్ జన్మించగా.. 2021లో జహంగీర్ పుట్టాడు. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్‌కు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ ఉన్నారు. ఈ ఇద్దరూ సినిమాలనే కెరీర్‌గా ఎంచుకున్నారు.

Story first published: Wednesday, October 15, 2025, 12:45 [IST]
Other articles published on Oct 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+