
దూకుడు తగ్గించాలి..
'రిషభ్ పంత్ జట్టులోకి వచ్చినప్పటి నాటి కంటే...ఇప్పుడు చాలా పరిణతి చెందిన క్రికెటర్‌లా కనిపిస్తున్నాడు. అతను షాట్లు ఎక్కువగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. మంచి షాట్లు ఆడగల సత్తా అతడి దగ్గర ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పంత్ ఆడే షాట్లు కూడా చూడచక్కగా ఉంటాయి. కానీ, ఇంగ్లండ్ పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. అక్కడ ప్రతి బంతిని హిట్ చేయడానికి ప్రయత్నించకుండా క్రీజులో ఎక్కువ సమయం ఉండేలా ఆడాలి. పంత్ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆడాలి. లేకుంటే మూల్యం చెల్లించుకుంటాడు.

రోహిత్‌కు చెప్పిందే
ఎన్నో రకాల షాట్లు ఆడగలిగే రోహిత్ శర్మకు కూడా ఇదే చెప్పాం. చాలాసార్లు ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ ఔటయ్యాడు. పంత్‌కు కూడా అదే చెబుతున్నా. పంత్ అద్భుతమైన, ఎంతో విలువైన ఆటగాడు. అతడు షాట్లు ఆడటానికి ముందు ఎక్కువ సమయం క్రీజులో గడపాలి. ఇంగ్లండ్ పరిస్థితులు భిన్నమైనవి' అని కపిల్‌దేవ్ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అనంతరం అతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

బెస్టాఫ్-3 ఫార్మాట్‌లో..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నియమ నిబంధనలపై తర్జన భర్జన పడుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు కపిల్ దేవ్ విలువైన సలహా ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌ను బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో నిర్వహించాలని సూచించాడు. 'ఒక్క మ్యాచ్‌తో విజేతను తేల్చేకంటే బెస్టాఫ్ 3 ఫార్మాట్‌లో ఫైనల్ నిర్వహించడం ఉత్తమమం అనేది నా అభిప్రాయం. ఈ రోజుల్లో మ్యాచ్‌లకు సిద్దం కావడం అంత పెద్ద విషయం కాదు. బెస్టాఫ్ 3 వల్ల టెస్ట్‌లకు ఆధరణ పెరుగుతుంది. ప్రజలకు కావాల్సిన మజా లభిస్తుంది.'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

అవసరమైతే ఆరో రోజు..
మరోవైపు ఈ మెగా ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విన్నర్ ఎవరు? ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒకట్రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోతే పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఐసీసీ సిద్దమవుతోంది. రిజర్వ్‌డే ఉంటుందని, డ్రా అయితే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఇదివరకే ప్రకటించినా.. తాజాగా ఈ క్లాజ్‌ను తన వెబ్‌సైట్‌నుంచి తొలగించడంతో సందిగ్దం నెలకొంది.
అయితే ప్రతికూల వాతావరణం, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐదు రోజుల్లో నిర్ణీత ఓవర్లు పూర్తికాకపోతే ఆటను ఆరో రోజుకు పొడిగించే విషయంపై ఐసీసీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్-న్యూజిలాండ్ మధ్య సౌతాంప్టన్‌లో జరిగే ఈ మెగా ఫైనల్ ప్లేయింగ్ కండిషన్స్‌పై ఈ వారంలో ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications












