కోహ్లీ అలా మాట్లాడటం సరికాదు.. టీమ్ కాన్ఫిడెన్స్ పెంచాలి: కపిల్ దేవ్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు చాలా బలహీనంగా ఉన్నాయని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. విరాట్ కోహ్లి లాంటి మేటి ఆటగాడు తమ జట్టులో ధైర్యం లోపించిందని చెప్పడం సరికాదన్నాడు. న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఘోర వైఫల్యంపై స్పందించిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్లిష్ట సమయంలో జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉందన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ పనిచేయాలన్నాడు.

కాన్ఫిడెన్స్ పెంచండి..
'జట్టు కోసం కోహ్లీ చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. గెలవాలనే కసి, కోరిక అతడిలో ఉన్నాయని మనకు తెలుసు. అతణ్ని నమ్మాం. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, కెప్టెన్ ఆలోచన సరళి ఇలా ఉంటే.. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపడం కష్టం. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపమని నా స్నేహితుడు రవిశాస్త్రితో పాటు ధోనీని కోరుతున్నా. ఆటగాళ్లతో మాట్లాడి, వారిలో విశ్వాసాన్ని పెంచడం మెంటార్‌గా ధోనీ బాధ్యత. మనం బాగా ఆడడం ద్వారా సెమీఫైనల్ చేరాలి. ఇతర జట్లపై ఆశలు పెట్టుకోవడం సరి కాదు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

మాటలు రావడం లేదు..
న్యూజిలాండ్‌తో ఎదురైన ఓటమిపై మాట్లాడుదామంటే మాటలు రావడం లేదని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు.
'అది భారత్‌కు చాలా కష్టమైన రోజు. కానీ క్రికెట్లో ఇలాంటి రోజులు వస్తుంటాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. నిజాయతీగా చెప్పాలంటే.. మాట్లాడేందుకు ఏమీ లేదు. వచ్చే రోజుల్లో మన జట్టు గొప్పగా ఆడుతుందని ఆశిస్తున్నానంతే. న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత్ ఎప్పుడూ వెనుకబడే ఉంది. మన బ్యాట్స్‌మెన్ చాలా ఇబ్బందిపడ్డారు. సింగిల్స్ తేలిగ్గా రాలేదు. దాంతో వాళ్లు భారీ షాట్ల కోసం ప్రయత్నించక తప్పలేదు. మన బౌలింగ్‌లో పదును లోపించింది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఏర్పాట్లు, బౌలింగ్ మార్పులు గొప్పగా ఉన్నాయి. పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటాడు.'అని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.

పేలవ షాట్స్..
భారత ఓటమి తీవ్ర నిరాశను కలిగించిందని సెహ్వాగ్ అన్నాడు. గతంలోలానే న్యూజిలాండ్ మరోసారి దెబ్బతీసిందన్నాడు. ' భారత జట్టు ప్రదర్శన నిరాశ కలిగించింది. న్యూజిలాండ్ గొప్పగా ఆడింది. భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపిక పేలవం. గతంలో కొన్నిసార్లు చేసినట్లే న్యూజిలాండ్ ఈసారి కూడా భారత్ ముందంజ వేయకుండా దాదాపుగా చేయగలిగింది.'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇతర దేశాల నుంచి భారత్ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు.. అనుభవం సంపాదించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా లీగులు ఆడేందుకు తమ ఆటగాళ్లను అనుమతించాలని బీసీసీఐకి సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications