Kapil Dev: నాలుగు ఓవర్లు వేయడానికి చస్తున్నారు.. ఆల్‌రౌండర్ల కొరతపై దిగ్గజ కెప్టెన్ అసహనం!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమికి ప్రధాన కారణం పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం. చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లతో సహా క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరు చెప్పే మాట ఇది. అవును పేస్ బౌలింగ్‌కు అనుకూలించే సౌతాంప్టన్ పిచ్‌పై భారత్ ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగడం, పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం కోహ్లీసేన కొంపముంచింది. పేస్ ఆల్‌రౌండర్లతో మొత్తం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో 8 వికెట్లతో కోహ్లీసేనను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది.

ఒక్క ఆల్‌రౌండర్ లేడు..
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన 20 మంది సభ్యులు గల భారత జట్టులో ఒక్క పేస్ ఆల్‌రౌండర్ లేడు. గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యా జట్టులో ఈ రోల్ పోషించినప్పటికీ వెన్నుగాయం తర్వాత అతను బౌలింగ్ చేయలేకపోతున్నాడు. దాంతో అతని సెలెక్టర్లు పక్కనపెట్టేసారు. ఒకప్పడు కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ను ప్రపంచ క్రికెట్‌కు పరిచయం చేసిన భారత్ నేడు.. ఓ జెన్యూన్ ఆల్‌రౌండర్‌ను తయారు చేసుకోలేకపోతుంది.

చాలా మార్పు వచ్చింది..
దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ తరం ఆటగాళ్లు మల్టిపుల్ రోల్ పోషించేందుకు ఆసక్తి చూపించడం లేదన్నాడు.'ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడితే ఎక్కువ గాయపడతారు! కానీ, ఈనాటి క్రికెట్ సులభ స్థాయికి మారింది. బ్యాటు లేదా బంతితో సత్తా చాటితే చాలు. అదే మా తరంలో మేం ఇంకా ఎన్నో చేయాల్సి వచ్చేది. ఈనాటి క్రికెట్ మారిపోయింది.' అని కపిల్ అన్నారు.

4 ఓవర్లు వేయలేకపోతున్నారు..
'కొన్నిసార్లు బౌలర్ నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం చూస్తే బాధేస్తోంది. వారికి మూడు, నాలుగు ఓవర్లకు మించి బంతి ఇవ్వడం లేదన్న సంగతి నాకు తెలిసింది. మా తరంలో ఎలా ఉండేదో గుర్తొస్తోంది. అది తప్పో ఒప్పో నేను చెప్పడం లేదు. నెట్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు వచ్చే ఆఖరి ఆటగాడికీ మేం పది ఓవర్లు విసిరేవాళ్లం. అలాంటి వైఖరి అభివృద్ధి చేసుకోవాలి. అలా సాధన చేస్తేనే కండరాలు బలపడతాయి. ఇప్పటి వాళ్లకు నాలుగు ఓవర్లు విసిరితే చాలనిపిస్తోంది. కానీ, మా తరం వాళ్లకి అది కాస్త వింతగా ఉంటుంది' అని కపిల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications