Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా అయితే ఐపీఎల్ ఆడొద్దు.. కోహ్లీకి చురకలంటించిన కపిల్

Kapil Dev Says If you think there is burnout then dont play IPL 2020
IPL 2020 : Is Kapil Dev Satires On Virat Kohli Indirectly? | Oneindia Telugu

హైదరాబాద్ : తీరికలేని షెడ్యల్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మండిపడ్డాడు. బీజీ షెడ్యూల్ వ‌ల్ల అలిసిపోతున్నామని భావిస్తున్న ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం మానేయ్యాలని సూచించాడు.

న్యూజిలాండ్ టూర్‌కు ముందు విరాట్ కోహ్లీ.. బిజీ షెడ్యూల్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. రాను రాను ఫ్లైట్ దిగి మైదానంలోకి వెళ్లి, ఆట‌లు ఆడాల్సిన ప‌రిస్థ‌తి నెల‌కొంటుందేమోనని నిర్వహాకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీనిపై తాజాగా క‌పిల్ దేవ్ కౌంట‌రిచ్చాడు. విరాట్ పేరును ప్రస్తావించకుండా చురకలంటించాడు.

ఐపీఎల్ ఆడకండి..

ఐపీఎల్ ఆడకండి..

‘తీరిక లేని షెడ్యూల్‌తో అలసిపోతున్నామని భావిస్తే ఐపీఎల్ ఆడొద్దు' అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ సూచించాడు.‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తప్పుకోవాలంటే ఇబ్బంది కానీ.. ఐపీఎల్ ఆడకపోవడం పెద్ద సమస్యే కాదు. ఐపీఎల్‌లో దేశం త‌ర‌పున ఏం ప్రాతినిధ్యం వహించడం లేదు కదా. అలసిపోతున్నామనుకుంటే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకొండి. దేశానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌వారిలో అంకిత‌భావానికి లోటు ఉండ‌కూడదు.'అని చెప్పుకొచ్చాడు.

నాకు తెలియదు..

నాకు తెలియదు..

ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో ఎవ‌రైనా బీజీ షెడ్యూల్ వల్ల‌, ఇబ్బందుల‌కు గురైన‌ట్లు అనిపించిందా?అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కపిల్ నిరాకరించాడు. ‘నాకు తెలియదు. టీవీ‌లో వారి ఆటను చూస్తూ దీనిపై కామెంట్ చేయడం సమంజసం కాదు'అని ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ బదులిచ్చాడు.

అది భావోద్వేగాలపై..

అది భావోద్వేగాలపై..

అలసిపోవడమనేది శారీరకంగా ఉన్న మానసిక భావోద్వేగ స్థితన్నారు.‘ఒక మ్యాచ్‌లో వికెట్లు తీసినా.. లేదా పరుగుల చేసినా.. అల‌స‌ట అన్పించ‌దు. అదే ధార‌ళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నా.. త్వరగా ఔటైనా.. అలసిపోయామనే భావన వస్తుంది. ఇదంతా భావోద్వేగాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది' కపిల్ చెప్పుకొచ్చాడు.

 బిజీ షెడ్యూల్‌పై..

బిజీ షెడ్యూల్‌పై..

సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్ చేరుకున్న తర్వాత కోహ్లీ టైట్ షెడ్యూల్‌పై అసహనం వ్యక్తం చేశాడు. 'ఇటీవలి కాలంలో చాలా క్రికెట్ ఆడాం. సిరీస్‌-సిరీస్‌కు మధ్య సమయం కుదించుకుపోతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడాం. అప్పుడు మైదానంలో ఎక్కువ సమయం గడిసాం. అంతకన్నా ముందు శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడాం. భారత్‌ కన్నా ఏడు గంటల ముందు నడుస్తున్న న్యూజిలాండ్‌కు వచ్చి ఇంత త్వరగా సర్దుకోవడం చాలా కష్టం. టోర్నీ నిర్వాహకులు ఇలాంటి విషయాలపై భవిష్యత్‌లో దృష్టిసారిస్తారని ఆశిస్తున్నా' అని అప్పట్లో వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, February 28, 2020, 12:41 [IST]
Other articles published on Feb 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+