సూర్య ఇన్నింగ్స్‌కు మాటల్లేవ్.. శతాబ్దానికొక్కరే ఉంటారు: కపిల్ దేవ్

న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌పై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యలాంటి ఆటగాళ్లు శతాబ్దానికొక్కరు మాత్రమే ఉంటారని కొనియాడాడు. సూర్య ఇన్నింగ్స్‌ను వర్ణించేందుకు తన దగ్గర మాటల్లేవని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో మూడో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.
తనకే సాధ్యమనే సిక్స్‌లతో ఫాస్టెస్ట్ సెంచరీతో అందర్నీ ఆకట్టుకున్నాడు. దాంతో ఈ యువ బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే సూర్య కుమార్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన కపిల్ దేవ్ అతన్ని ఆకాశానికెత్తాడు.

సూర్య బ్యాటింగ్‌కు మాటల్లేవ్..
'కొన్నిసార్లు సూర్యకుమార్ యాదవ్ ఆటను వర్ణించడానికి నాకు మాటలు రావు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆట చూసినప్పుడు వీరి స్థానాలను భర్తీ చేసే ఆటగాడున్నాడా? అనుకుంటాం. కానీ అలాంటి ఆటగాడే సూర్యకుమార్ యాదవ్. వాస్తవానికి భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు.
కానీ సూర్యలాంటి ప్రత్యేక బ్యాటింగ్ శైలి కలిగిన ఆటగాడిని నేను చూడలేదు. అతను బ్యాటింగ్ చేసే విధానమే భిన్నంగా ఉంటుంది. అతను ఆడే ఫైన్ లెగ్ షాట్ బౌలర్‌ను భయపెడుతుంది. ఎందుకంటే అతను నిలబడి మిడ్-ఆన్ , మిడ్-వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు.

శతాబ్దానికి ఒక్కడు..
బౌలర్ లైన్ అండ్ లెంగ్త్‌ను నిలకడగా ఎంచుకోగలడు. అందుకే బౌలర్లు అతనికి బౌలింగ్ చేసేందుకు భయపడుతుంటారు. నేను నా కెరీర్‌లో చాలా మంది గొప్ప బ్యాటర్లను చూశాను. ఆట నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు వచ్చి వెళ్లారు. నేను వీవీ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, ఏబీ డివిలియర్స్ వంటి అసాధారణమైన ఆటగాళ్లను చూశాను.
కానీ సూర్యలా కొద్ది మంది మాత్రమే బంతిని క్లీన్‌గా హిట్ చేయగలరు. అతనికి నా హ్యాట్సాఫ్. సూర్య వంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కరు మాత్రమే వస్తారు.'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

పడుకొని సిక్స్ కొట్టిన సూర్య..
శ్రీలంకతో మూడో టీ20లో సూర్య.. ఓ సిక్స్‌ను నేలపై పడుకొని కొట్టాడు. ఇది ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలవగా.. అతని వినూత్న షాట్లకు విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. మదుషంక వేసిన 13వ ఓవర్ రెండో బంతిని సూర్య కిందపడుతూ సిక్సర్ బాదాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేస్తాడని ముందే గ్రహించిన సూర్య.. స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో ముందుగా స్టంప్స్ వైపు జరిగాడు.
సూర్య జరగడాన్ని గమించిన బౌలర్ తన ప్లాన్ మార్చి వైడ్ ఫుల్‌టాస్ వేసాడు. అయినా సూర్య బంతిని సూపర్ స్కూప్ షాట్‌తో షార్ట్ ఫైన్ దిశగా సిక్సర్ బాదాడు. షాట్ ఆడే క్రమంలో పూర్తిగా నేలపై పడిన సూర్య.. పల్టీలు కొట్టాడు. ఈ షాట్‌ను చూసిన లంక ఆటగాళ్లు, ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. సూర్యకు మాత్రమే ఈ షాట్స్ సాధ్యమని, ఇది వేరే లెవెల్ క్రికెట్ అని నెటిజన్లు కొనియాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications