Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్‌ను చెంప దెబ్బ కొట్టాలనుంది: కపిల్ దేవ్

Kapil Dev is quite angry with Rishabh Pant and wants to slap him once he recovers

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను కొట్టాలని ఉందని దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. అతని వల్లే టీమిండియాలో గందరగోళం ఏర్పడిందని చెప్పాడు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ తీవ్ర గాయాలతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన పంత్.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలంటే ఏడాది సమయం పట్టనుంది. ఇక పంత్ లేకుండానే టీమిండియా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ఆడనుంది. అతని గైర్హాజరీలో టీమిండియా కాంబినేషన్ సవాల్‌గా మారింది.
చెంపదెబ్బ కొట్టాలనుంది..

చెంపదెబ్బ కొట్టాలనుంది..

ఈ నేపథ్యంలోనే రిషభ్ పంత్‌ గురించి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయవద్దని చెంపదెబ్బ కొడతానన్నాడు. 'రిషభ్ పంత్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్లి చెంప దెబ్బ కొట్టాలనుంది. పంత్ లేకపోవడంతో టీమిండియాలో గందరగోళం నెలకొంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని మందలిస్తా. రిషభ్‌ పంత్‌ను ఎంతో ప్రేమిస్తా. కానీ ఇప్పుడు అతనిపై నాకు పీకల దాకా కోపం ఉంది.

ఈ కాలం కుర్రాళ్లే ఇంత..

ఈ కాలం కుర్రాళ్లే ఇంత..

ఈ కాలం కుర్రాళ్లు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎందుకు కెరీర్ నాశనం చేసుకుంటారో అర్థం కాదు. అతను ఒక్కడు జట్టులో ఉండి ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు గట్టి సమాధానం చెప్పేవాడు. రిషభ్ పంత్‌ని ప్రపంచమంతా ప్రేమిస్తోంది. అతను త్వరగా కోలుకుని, క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తోంది. ఇంతమంది ప్రేమను పొందడం ఎంతో అదృష్టం. పిల్లలు తప్పుచేస్తే కొట్టి సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

కేఎస్ భరత్‌కు చాన్స్..

కేఎస్ భరత్‌కు చాన్స్..

రిషభ్ పంత్ లేకుండానే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. రిషభ్ పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లను జట్టులోకి తీసుకుంది. అయితే ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని ఈ ఇద్దరు వికెట్ కీపర్లు పంత్‌ లేని లోటును తీర్చుతారా? అనేది సందేహంగా మారింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు భరత్ ఏ తరఫున ఆడిన అనుభవం కేఎస్ భరత్‌కు ఉండగా.. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు పెద్దగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలో కేఎస్ భరత్‌ తుది జట్టులో అవకాశం దక్కించుకోనున్నాడు. అయితే పంత్‌లా పవర్ హిట్టింగ్ చేయగలడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Story first published: Wednesday, February 8, 2023, 16:52 [IST]
Other articles published on Feb 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+