
ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటమా?
టీమిండియా తదుపరి మూడు మ్యాచ్‌లు గెలిచినా..టోర్నీలో ముందడుగు వేయాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. అఫ్గాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడాలి. వారి కంటే మెరుగైన రన్ రేట్ కోహ్లీసేనకు ఉండాలి. అద్భుతం జరిగితే తప్పా భారత్ సెమీస్ చేరలేని పరిస్థితి. అయితే సెమీస్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం భారత జట్టుకు తగినది కాదని కపిల్ అభిప్రాయపడ్డాడు.
జట్టులో పెద్ద ఆటగాళ్లు రాణించలేకపోతే వారిని పీకిపారేయాల్సిన సమయం ఆసన్నమైందని, యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలన్నాడు. 'ఇతర జట్ల ఫలితాలపై భారత జట్టు సక్సెస్ ఆధారపడటం ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ప్రపంచకప్ గెలవాలనుంటే.. సొంత బలాలతో సెమీఫైనల్ చేరాలి. అంతేగానీ ఇతర జట్ల ఫలితాల ఆధారంగా కాదు. నా అంచనా ప్రకారం జట్టులో పెద్ద ప్లేయర్ల భవితవ్యంపై సెలెక్టర్లు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

భారతమైతే పక్కనపెట్టండి..
ఇక టీమిండియా ఘోర వైఫల్యానికి అనేక కారణాలున్నాయని, టీమ్ సెలెక్షన్, తీరిక లేని షెడ్యూల్, బయో బబుల్ వాతావరణం ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని జరుగుతున్న ప్రచారంపై కపిల్ భిన్నంగా స్పందించాడు. తీరిక లేని షెడ్యూల్‌తో ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే వారిని పక్కనపెట్టాలని కపిల్ సూచించాడు. భారత్‌లో ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని, ఐపీఎల్ కూడా సత్తా చాటి మంచి జోష్ మీదున్నారని, వారే భారత జట్టు భవిష్యత్తని, వారికి అవకాశం ఇవ్వాలన్నాడు.

యువ ఆటగాళ్లతో ఓడినా పర్లేదు..
'ఐసీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంపై సెలెక్టర్లు ఆలోచన చేయాలి. వారికి అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయమా? తదుపరి తరాన్ని ఎలా సిద్దం చేయాలి? అనే కోణం చర్చ చేయాలి. యువ ఆటగాళ్లతో ఓడిపోయినా జట్టుకు నష్టం వచ్చేదం లేదు. ఎందుకుంటే వారికి అనుభవం లభిస్తోంది. కానీ ఈ పెద్ద ప్లేయర్లు సరిగ్గా ఆడకపోయినా.. పేలవ ప్రదర్శన కనబర్చినా చాలా విమర్శలు వస్తాయి. బీసీసీఐ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావాలి.'అని కపిల్ దేవ్ సూచించాడు.

కపిల్ చెబతుంది వీళ్ల గురించేనా?
టీ20 ప్రపంచకప్‌లో చెత్త ఆటతో జట్టుకు భారంగా మారిన హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను ఉద్దేశించే కపిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఈ సీనియర్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం స్టార్ డమ్‌తోనే జట్టులో కొనసాగుతున్నారన్నది వాస్తవం.
పైగా సెలెక్టర్లు కూడా అనుభవం దృష్ట్యానే వీరిని ఎంపిక చేశారు తప్పా.. ఫామ్‌ను చూసి కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కపిల్ ఈ వ్యాఖ్యలు చేశాడని విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లను ఎంపికచేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications












