న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే జడేజాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి : కపిల్‌దేవ్

Kapil Dev explains why Ravindra Jadeja getting More Chances

న్యూఢిల్లీ : బ్యాటింగ్ విషయంలో రవీంద్ర జడేజాకు పోటీనిచ్చే స్పిన్నర్ జట్టులో లేకపోవడంతోనే అతనికి వరుసగా అవకాశాలు దక్కాయని టీమిండియా లెజండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు.

ఇక న్యూజిలాండ్ పర్యటనలో జడేజా వరుసగా అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐదు టీ20 సిరీస్‌లో, మూడు వన్డేల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడాడు. జడేజా కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కుల్చా జోడీనే విడదీశాడు. జడేజా వల్ల ఈ ఇద్దరు కలిసి ఒక్క మ్యాచ్ ఆడలేకపోయారు. జడేజాకు చాన్స్ ఇవ్వడం కోసం ఒకానొక దశలో కోహ్లీ బ్యాట్స్‌మన్‌పై వేటు వేయడానికి కూడా వెనకాడలేదు. అయితే కుల్దీప్, చాహల్‌ను కాదని జడేజాకు ఇన్ని అవకాశాలు రావడానికి గల కారణం అతని బ్యాటింగేనని కపిల్‌దేవ్ స్పష్టం చేశాడు.

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

ఓ న్యూస్ చానెల్‌‌తో మాట్లాడుతూ.. 'రవీంద్ర జడేజా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో.. అతను బౌలింగ్‌లో విఫలమైనా.. దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. టీమ్‌లో అతనికి పోటీగా ఉన్న ఏ స్పిన్నర్ (కుల్దీప్, చాహల్) ఈ తరహాలో బ్యాటింగ్‌లో చేయలేరు. ఒకవేళ భారత్ జట్టు.. ఇద్దరు ప్రొఫెషనల్ స్పిన్నర్లలో బరిలోకి దిగితే..? అప్పుడు బ్యాటింగ్ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. వాస్తవానికి బలమైన టాపార్డర్ ఉన్న టీమిండియాకి జడేజా బ్యాటింగ్‌తో పనిలేదు. కానీ.. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ అతను అద్భుతంగా ఫామ్ కనబర్చాడు. అందుకే.. అతనికి వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి.' అని కపిల్‌దేవ్ చెప్పుకొచ్చాడు.

టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్లు ఎవరు? మయాంక్‌తో బరిలోకి దిగేది శుభ్‌మనా? పృథ్వీనా?టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్లు ఎవరు? మయాంక్‌తో బరిలోకి దిగేది శుభ్‌మనా? పృథ్వీనా?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన రవీంద్ర జడేజా.. రెండో వన్డేలో 55 పరుగులతో ఒంటరి పోరాటం చేసి భారత్ జట్టుని గెలిపించేంత పనిచేశాడు. కానీ.. లోయర్ ఆర్డర్‌లో సైనీ మినహా అతనికి ఎవరూ సహకారం అందించకపోవడంతో ఆ మ్యాచ్‌లో భారత్‌కు పరాజయం తప్పలేదు. బౌలింగ్‌లోనూ జడేజా అదరగొట్టాడు.

అద్భుత ప్రదర్శనతో ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం పేలవ ఫీల్డింగ్, బౌలింగ్‌తో పాటు ఓపెనర్ల వైఫల్యంతో 0-3 వైట్‌వాష్ అయింది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సిద్ధమవుతోంది.

Story first published: Wednesday, February 12, 2020, 17:42 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X