For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో అలాంటి బ్యాటర్లు లేరు: కపిల్ దేవ్

ప్రస్తుత భారత జట్టులో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లాంటి స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్లు లేరని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడు. టీ20, వన్డేలు ఎక్కువగా ఆడటంతో క్రీజులో పాతుకుపోయి ఓపికగా ఆడే నైపుణ్యం భారత బ్యాటర్లకు లేకుండా పోయిందని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.

ఈ ఘోర పరాజయంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో భారత్ జట్టు సంధి దశలో ఉంది. తాజాగా భారత జట్టు ప్రదర్శనపై స్పందించిన కపిల్ దేవ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఎక్కువగా టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నారు. దాంతో బ్యాటర్లకు బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడే అవకాశం రావడం లేదు. స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు చాలా ఓపికగా ఆడాలి. అలాగే ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రస్తుతం మన దగ్గర క్రీజులో పాతుకుపోయే రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్పెషలిస్ట్ బ్యాటర్లు లేరు. టెస్ట్‌ల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే.

Kapil Dev Criticises India s Focus on Limited-Overs Cricket After Test Series Whitewash Against South Africa

స్పిన్, పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. కానీ టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ఈ తరహా పిచ్‌లపై ఫుట్‌వర్క్ చాలా కీలకం. కానీ రిషభ్ పంత్ శైలి వేరు. ఎందుకంటే దూకుడుగా ఆడటమే అతని స్టైల్. రిషభ్ పంత్‌ను డిఫెన్స్ ఆడమని మనం చెప్పలేం. ఎందుకంటే పంత్ సిక్స్‌లు, ఫోర్లతో ఎదురు

విరుచుకుపడి, ప్రత్యర్థి జట్టును కకావికలం చేయగల సమర్థుడు. అలాంటి నైపుణ్యమున్న అతనికి మనం నెమ్మదిగా ఆడి 100 బంతుల్లో 20 పరుగులు చేయమని చెప్పలేం. అతను అలా చేయలేడు కూడా'అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, November 29, 2025, 18:23 [IST]
Other articles published on Nov 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+