Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలి: కపిల్ దేవ్

దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడని భారత ఆటగాళ్ల పట్ల బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. గత రెండేళ్లుగా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో టీమిండియా తడబడుతోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైభవ్‌ సూర్యవంశీని మరి అంతగా లేపకండి: కపిల్ దేవ్

వైభవ్‌ సూర్యవంశీని మరి అంతగా లేపకండి: కపిల్ దేవ్

స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఆడలేకనే టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే టెస్ట్‌ల్లో టీమిండియా ఘోర వైఫల్యానికి స్పిన్ బౌలింగ్‌‌ను సమర్థవంతంగా ఆడలేకపోవడమే ప్రధాన కారణమని కపిల్ దేవ్ అన్నాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండటంతోనే స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.

Kapil Dev Blames Lack of Domestic Cricket for India s Struggles Against Spin

'దేశవాళీ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. టాప్ క్లాస్ ప్లేయర్లు తగినంతగా దేశవాళీ క్రికెట్ ఆడకపోవడం వల్లే భారత జట్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించి అందరూ దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేలా చూడాలి. దాంతో టాప్ క్లాస్ ఆటగాళ్ల నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం కుర్రాళ్లకు లభిస్తోంది.

ఈ మధ్య భారత్ ఎక్కువగా టీ20లు, వన్డేలు ఆడుతోంది. టెస్ట్ క్రికెట్‌ పూర్తిగా భిన్నమైదని. ఈ సమస్యను అధిగమించడానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. టీ20 మ్యాచ్‌లు పెరిగినందున పేసర్లు గాయాల బారిన పడకుండా వారి వర్క్‌లోడ్‌పై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి.'అని సూచించాడు.

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

Also Read

IND vs SL: భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ఇదే!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్ మొదలవ్వనుంది. గాలే వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేయాలి.

Story first published: Wednesday, August 12, 2026, 18:23 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+