
ట్వీట్ వార్..
అలాగే భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ ప్రముఖలకు సూచించారు. #IndiaTogether #IndiaAgainstPropaganda వంటి హ్యాష్ ట్యాగ్‌లతో కేంద్ర ప్రభుత్వానికి మద్దుతు తెలిపారు. మనమేంటో మనకు తెలుసు.. భారతీయులుగా ఐక్యంగా ఉందామని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేయగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, శిఖర్ ధావన్, అనిల్ కుంబ్లే, అజింక్యా రహానే తదితరులు కూడా రైతుల ఆందోళనపై స్పందించారు.

రైతులు కీలకం..
''మనమంతా కలిసికట్టుగా ఉన్నప్పుడు భారత్ బలంగా ఉంటుంది. రైతుల సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన తరుణం ఇది. దేశ ప్రగతిలో రైతులు కీలక భూమిక పోషిస్తున్నారు. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనడంలో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను పోషిస్తారని ఆశిస్తున్నా. ఐక్య భారత్'' అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా "భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. అందరం శాంతియుతంగా సమష్టిగా ముందుకు వెళ్లేలా అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను" అని పేర్కొన్నాడు.

కుక్కల్లా అరుస్తున్నారు..
అయితే రోహిత్ శర్మ ట్వీట్‌కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘాటుగా బదులిచ్చింది. భారత క్రికెటర్లను కుక్కులతో పోల్చుతూ అభ్యంతరకరంగా ట్వీట్ చేసింది. 'ఈ క్రికెటర్లందరూ దోబీ దగ్గర కుక్కల్లా ఎందుకు మొరుగుతున్నారు. అటు ఇంటికి కాకుండా.. ఇటు ఘాట్‌కు కాకుండా మాట్లాడుతున్నారు. రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాలకు రైతులే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? వారు అసలు రైతులే కాదు. రైతుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు'అంటూ వివాదాస్పద రీతిలో ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ గైడెలైన్స్‌కు విరుద్దంగా ఉండటంతో ట్విటర్ దాన్ని తొలగించింది.

మండి పడుతున్న ఫ్యాన్స్..
ఇక భారత క్రికెటర్లను కుక్కులతో పోల్చిన కంగనా రనౌత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ బాలీవుడ్ నటిపై దుమ్మెత్తిపోస్తున్నారు. కంగనాకు మతి చెడిందని అసలేం మాట్లాడుతుందో కూడా అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. దేశానికి మద్దుతుగా నిలిచిన క్రికెటర్లపై కంగనా రనౌత్ అనవసరంగా నోరుపారేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications
