
టెస్ట్ సిరీస్ కోసం..
'భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు కేన్ విలియమ్సన్ దూరంగా ఉండనున్నాడు. నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు అన్ని విధాల సిద్దమయ్యేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం రాత్రి జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో పాటు, శుక్రవారం, ఆదివారం జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడు. ఇప్పటికే అతను జైపూర్‌లోని టెస్ట్ స్పెషలిస్ట్ గ్రూప్‌లో చేరి రెడ్ బాల్ క్రికెట్ సన్నాహకాలపై దృష్టి పెట్టాడు. టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను టీమ్ సౌథీ నడిపించనున్నాడు. కైల్ జెమీసన్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్‌లు టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఆడనున్నారు. లూకీ ఫెర్గూసన్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను టీ20 సిరీస్ ఆడే అవకాశం ఉంది.'అని కివీస్ బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది.

మోచేతి గాయం నుంచి..
సుదీర్ఘ కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ కొంత విశ్రాంతితో ఉపశమనం పొంది టెస్ట్ సిరీస్ బరిలోకి దిగాలనుకుంటున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చిన సారథిగా విలియమ్సన్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే, విశ్వవిజేతగా నిలవాలన్న కేన్ బృందం ఆశలపై నీళ్లు చల్లి.. ఆస్ట్రేలియా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దీంతో కివీస్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తృటిలో టైటిల్ మిస్..
ఇక ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే టీమిండియాతో సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో యూఏఈ నుంచి కివీస్ ఆటగాళ్లు జైపూర్‌కు చేరుకున్నారు. నవంబరు 17 నుంచి మొదలుకానున్న పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత.. వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ ఇక టీ20 సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ తొలిసారి పూర్తిస్థాయిలో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా.. మొదటి టెస్టుకు అజింక్య రహానే, రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యం వహించనున్నారు.

టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే:
టాడ్ ఆస్ట్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, లోకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, కైలీ జెమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ(కెప్టెన్).


Click it and Unblock the Notifications
