బ్యాటింగ్‌లో అలా ఆడుంటే.. కోల్‌కతాను ఓడించేవాళ్లం: కేన్ మామ

దుబాయ్: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసుంటే కోల్‌కతాను ఓడించేవాళ్లమని, స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. కేకేఆర్‌తో ఆదివారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. పిచ్ పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోయామన్నాడు. నెమ్మదైన పిచ్‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేసే.. చివర్లో ధాటిగా ఆడాల్సిందన్నాడు.

150 రన్స్ చేసుంటే..
'ఇది చాలా తక్కువ స్కోర్. 150 పరుగులు చేసుంటే బాగుండేది. ఇలా తక్కువ స్కోరును కాపాడుకోవడం ఎప్పుడైనా కష్టం. అలాగే ఈ సీజన్ మొత్తంలో మేం సరైన స్కోర్ సాధించలేకపోయాం. పేలవ బ్యాటింగ్‌తో వరుస ఓటములు ఎదుర్కొన్నాం. మా పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లోనూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. చివరి 3-4 ఓవర్లలో ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 150 ధాటించాల్సింది. ఇంకొన్ని పరుగులు చేసుంటే కోల్‌కతాతో పోటీపడేందుకు బాగుండేది. ఇప్పుడు మేం ఎలాగో పోటీలో లేనందున కొత్త ఆటగాళ్లకు అవకాశాలిస్తున్నాం. నెట్స్‌లో మాలిక్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాం. అతనిలో మంచి పేస్ ఉంది. అందుకే అతనికి అవకాశం ఇచ్చాం' అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

సమష్టి ప్రదర్శనతో..
ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించి అద్భుత విజయాన్నందుకున్నామని కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. పిచ్ నెమ్మదించడంతోనే ఈజీ టార్గెట్‌ను చేధించడానికి చివరి ఓవర్ వరకు ఆడాల్సి వచ్చిందన్నాడు. సహజంగా దుబాయ్ పిచ్ పవర్‌ప్లేలో స్వింగ్ అవుతుందని, కానీ ఈ మ్యాచ్‌లో అలా జరగలేదని తెలిపాడు. 'మేం బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాం. చేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ (57) బాగా ఆడటమే కాకుండా ముందుండి జట్టును నడింపించాడు. మరోవైపు మాకు బలమైన రిజర్వ్‌బెంచ్ ఉంది.

అందుకే షకీబ్‌ను తీసుకోలేదు..
దాంతోనే ఇప్పటి వరకు షకీబ్ అల్ హసన్‌ను తీసుకోవడం కష్టమైంది. కానీ అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు. యూఏఈ పరిస్థితులకు అలవాటు పడి రాణిస్తున్నాం. ఎలాగైనా విజయాలు సాధించాలనే కసితో ఉన్నాం. డ్రెస్సింగ్ రూమ్‌లో మా ప్రణాళికలు కూడా ఆటపై మంచి ప్రభావం చూపుతున్నాయి. మా ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటూ మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. ప్రత్యేకించి ఈ స్లో పిచ్ పరిస్థితులకు అలవాటు పడటం చాలా సంతోషంగా ఉంది' అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

చెత్త బ్యాటింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), అబ్దుల్ సమద్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో టీమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 116 పరుగులు చేసి నాలుగు బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(51 బంతుల్లో 10 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లతో 25) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో దినేశ్ కార్తీక్(18 నాటౌట్) బౌండరీతో విజయ లాంచనాన్ని పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications