Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒత్తిడికి చిత్తయ్యాం.. సుందర్ గాయం దెబ్బతీసింది: కేన్ విలియమ్సన్

Kane Williamson says

పుణే: భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒత్తిడికి గురయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ధాటిగా ఆడాలనే ఆతృతలో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడిన సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో తమ బౌలింగ్ బలం తగ్గిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. చివరి వరకు అద్భుతంగా పోరాడమని తెలిపాడు. తదుపరి మ్యాచ్‌‌కు మరింత బలంగా తయారై బరిలోకి దిగుతామని చెప్పాడు.

'200 ప్లస్ టార్గెట్ చేధించడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. కానీ మేం అద్భుతంగా మొదలుపెట్టాం. కానీ ప్రత్యర్థి జట్టు తమ భారీ లక్ష్యంతో మమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది. మేం అద్భుతమైన పోరాటం కనబర్చాం. కానీ దురదృష్టవశాత్తు మాకు ఏదీ కలిసి రాలేదు. వికెట్ స్లోగా ఉంది. అయినా మా సాయశక్తులా ప్రయత్నించాడు. గాయంతో సుందర్ సేవలను కోల్పోవడం మా బౌలింగ్ విభాగాన్ని బలహీనం చేసింది. క్వాలిటీ స్పిన్నర్లు కలిగిన జట్టుతో మేం అద్భుతంగా ఆడాం. ఇలానే మేం మా ఆటను కొనసాగిస్తే సరిపోతుంది. తొలి దశ లీగ్‌లో మేం సాధించిన విజయాల మూమెంట్ అలానే ఉంది. కొన్ని విషయాల్లో మెరుగైతే సరిపోతుంది. తుదపరి మ్యాచ్‌లో బలంగా బరిలోకి దిగుతాం.'అని కేన్ మామ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరి ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.

అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. నికోలస్ పూరన్(33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64 నాటౌట్), కేన్ విలియమ్సన్(37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి నాలుగు వికెట్లు తీయగా.. సాంట్నర్, ప్రిటోరియస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కీలక సమయంలో కేన్ విలియమ్సన్ ఔటవ్వడం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు.

Story first published: Sunday, May 1, 2022, 23:52 [IST]
Other articles published on May 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+