Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్లే ఆఫ్స్ చేరాలంటే.. ఇక నుంచి ఆ ఫార్మూలాతో ఆడాలి: కేన్ మామ

Kane Williamson says Sunrisers need

ముంబై: రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసిందని చెప్పాడు. చేజింగ్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైన తాము మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 67 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చిత్తు చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన కేన్.. సమిష్టి వైఫల్యమే తమ పరాజయానికి కారణమని చెప్పాడు. జట్టులో చాలా లోపాలున్నాయని, తదుపరి మ్యాచ్‌లకు వాటిని సరిచేసుకొని బరిలోకి దిగుతామని చెప్పాడు. అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటూ ఆటను మెరుగుపరుచుకుంటే టోర్నీలో ముందడుగు వేయవచ్చని కేన్ మామ అభిప్రాయపడ్డాడు.

ముందు ముందు కఠిన సవాళ్లు..

ముందు ముందు కఠిన సవాళ్లు..

'వరుస పరాజయాలతో ముందు ముందు మాకు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఒత్తిడిని అధిగమిస్తూ ఆడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. మేం ఓడిన మ్యాచ్‌ల్లో అన్ని చేధించాల్సినే లక్ష్యాలే. క్వాలిటీ బ్యాటింగ్ ఉన్నా సమష్టిగా రాణించడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాం. టోర్నీ ఆరంభంలో కొత్త బంతితో మేం ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాం. మళ్లీ అలాంటి ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. తదుపరి గేమ్‌కు మా తప్పిదాలను సరిచేసుకొని సిద్దమవుతాం. తదుపరి మ్యాచ్‌కు కావాల్సినంత టైమ్ కూడా ఉంది. దీన్ని వాడుకొని విజయాల బాట పడుతాం.

సమష్టి వైఫల్యం..

సమష్టి వైఫల్యం..

ఆర్‌సీబీ‌తో మేం పూర్తిగా విఫలమయ్యాం. ఆర్‌సీబీతో పాటు అన్ని జట్లు బలమైనవే. అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటూ మా ఆటను మెరుగుపరుచుకుంటే సరిపోతుంది. మేం ఓడిన వ్యత్యాసాలన్నీ సరిగ్గానే ఉన్నాయి. మా ఇంప్రూవ్‌మెంట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఆర్‌సీబీతో మేం సరైన ఆరంభం అందుకోలేదు. బ్యాటింగ్‌కు ఇబ్బందిగా ఉన్న వికెట్‌పై ఆర్‌సీబీ మంచి లక్ష్యాన్ని ఉంచింది. వికెట్‌పై బంతి ఆగిరావడంతో పాటు టర్న్ కూడా ఉంది.

అలా చేస్తే గెలిచేవాళ్లం..

అలా చేస్తే గెలిచేవాళ్లం..

అయితే మేం కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. వీలైనంత వరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాల్సింది. వాంఖడేలో చివరి వరకు తీసుకెళ్తే గెలిచే అవకాశాలు లభిస్తాయి. కానీ మేం అలా ఆడలేకపోయాం. ఈ ఓటమితో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. జాన్సెన్, నటరాజన్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. తదుపరి మ్యాచ్‌కు వారు అందుబాటులోకి వస్తారని స్పష్టంగా చెప్పలేను. వారు ఫిట్ అవ్వాలనే ఆశిస్తున్నా'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

 హసరంగా హల్‌చల్..

హసరంగా హల్‌చల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(0) గోల్డెన్ డకౌటైనా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్), రజత్ పటిదార్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) రాణించారు. చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), దినేశ్ కార్తీక్(8 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జగదీష సుచిత్ రెండు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి(37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఎయిడెన్ మార్కరమ్(21), నికోలస్ పూరన్(19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సన్‌రైజర్స్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. వానిందు హసరంగా కెరీర్ బెస్ట్ (5/18) ప్రదర్శనతో ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్ 2 వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, May 8, 2022, 21:55 [IST]
Other articles published on May 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+