Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kane Williamson: టీమిండియాతో సెమీస్ చాలా స్పెషల్!

World Cup 2023, NZ vs SL: వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌‌ ఆడటం తమకు చాలా ప్రత్యేకమని, హోమ్ టీమ్‌తో ఆడాల్సి రావడం సవాల్‌తో కూడుకున్నదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఈ ఆసక్తికర పోరు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్‌లో రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ సత్తా చాటింది.

శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కివీస్ సెమీస్ బెర్త్ అధికారికంగా కన్ఫామ్ కాకపోయినా.. పాకిస్థాన్ విజయ సమీకరణాలు సంక్లిష్టంగా ఉండటంతో బ్లాక్ క్యాప్స్‌కు ఢోకా లేకుండా పోయింది. ఈ విజయానంతరం మాట్లాడిన కేన్ విలియమ్సన్.. తమ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

Kane Williamson says Playing semis is special but playing the home team will be challenging

సెమీస్ ఆడటం ప్రత్యేకమని చెప్పిన కేన్ మామ.. హోట్‌టీమ్‌తో ఆడాల్సి రావడం బిగ్ ఛాలెంజ్ అని అభిప్రాయపడ్డాడు. 'మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. లక్ష్యచేధనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం.. స్పిన్ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడం కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. పాకిస్థాన్ మ్యాచ్‌ తరహాలో పిచ్ ఉంటుందని అంచనా వేసాం.

అలాగే వాతావరణం కూడా ప్రతికూలం అవుతుందని భయపడ్డాం. కానీ అలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదు. శ్రీలంక పటిష్టమైన జట్టు అనే విషయం మాకు బాగా తెలుసు. టాపార్డర్‌లో పెరీరా అద్భుతంగా ఆడాడు. కానీ ఆరంభంలోనే వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. దాంతో లంకను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాం.

Kane Williamson says Playing semis is special but playing the home team will be challenging

పేస్‌కు అనుకూలంగా లేకున్నా.. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐదు, ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా స్పిన్నర్లు ఉండటం మా అదనపు బలం. మాతో మరికొన్ని జట్లు సమంగా ఈ టోర్నీని ముగించనున్నాయి. సెమీఫైనల్ చేరేది మా చేతుల్లో లేదు. మాకు కొన్ని రోజులు విశ్రాంతి లభించనుంది. ఏం జరుగుతుందనేది చెప్పలేం.

ఒకవేళ మేం సెమీస్ చేరితే మాత్రం ఆ మ్యాచ్ మాకు ఎంతో ప్రత్యేకం. కానీ హోమ్ టీమ్‌తో నాకౌట్ మ్యాచ్ ఆడాల్సి ఉండటం సవాల్‌తో కూడుకున్నదే. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. మాకు అదృష్టం కలిసి వస్తే అన్నీ మాకు అనుకూలంగానే జరుగుతాయి.'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 9, 2023, 22:41 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+