న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే గెలిచాం... ఇదో అద్భుత విజయం : విలియమ్సన్

INS VS NZ 3rd ODI: Kane Williamson Responded After ODI Series Sweep Against India
Kane Williamson Says New Zealand were Outstanding and Clinical

మౌంట్‌ మాంగనూయ్‌: భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆజట్టు 5 వికెట్లతో అలవోకగా గెలుపొందింది. అయితే తమ ఆటగాళ్లు సమిష్టిగా చెలరేగడంతో ఈ అద్భుత విజయాన్నందుకున్నామని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన సహచర ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఈ సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్‌లో భారత్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. కానీ, మా వాళ్లు ధీటుగా పోటీ ఇచ్చారు. బంతితో ప్రత్యర్థిని కట్టడి చేసి.. భారీ స్కోర్ సాధించకుండా చేశారు.' అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత్ దాదాపు 350కి పైగా పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ, కివీస్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి 300లోపే కట్టడి చేశారు.

మేం ఏం అంత చెత్తగా ఆడలేదు: కోహ్లీమేం ఏం అంత చెత్తగా ఆడలేదు: కోహ్లీ

ఇక సిరీస్ ఆసాంతం న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా ఆడారని విలియమ్సన్ కొనియాడాడు. 'భారత్ అన్ని ఫార్మాట్లలో ఎంత పటిష్టంగా ఉందో అందరికీ తెలిసిందే. ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని మేము స్పష్టంగా అనుకున్నాము. అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ జోరుని ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ కొనసాగిస్తాము. అద్భుతమైన ఇండియా జట్టుపై మా ఆటగాళ్లు అత్యద్భుత ప్రదర్శన చేశారు'అని కేన్ సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డ విలియమ్సన్ తొలి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు. ఆఖరి వన్డేలో బరిలోకి దిగి 22 పరుగులు చేశాడు.

నగ్నచిత్రాలు బయటపెడ్తానని బెదిరిస్తున్నాడు.. పాక్ క్రికెటర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలునగ్నచిత్రాలు బయటపెడ్తానని బెదిరిస్తున్నాడు.. పాక్ క్రికెటర్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (113 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లతో 112)సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 296 పరుగులు చేసింది. రాహల్‌కు తోడుగా శ్రేయస్ అయ్యర్(63 బంతుల్లో 9 ఫోర్లతో 62), మనీష్ పాండే (42), పృథ్వీ షా(40) ఫర్వాలేదనిపించాడు.

అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 305 రన్స్ చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మార్టిన్ గప్టిల్(66), హెన్రీ నికోలస్ (80) మెరుపులు మెరిపించగా.. చివర్లో గ్రాండ్‌హోమ్ (58 నాటౌట్) దాటిగా ఆడాడు.

Story first published: Tuesday, February 11, 2020, 20:54 [IST]
Other articles published on Feb 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X