
మిచెల్ సూపర్ బ్యాటింగ్..
'మేం అనేక సందర్భాల్లో ఒకరికొకరం తోడుగా రాణించాం. నేటి మ్యాచ్ కూడా క్రికెట్‌లో ఓ గొప్ప మ్యాచ్ అవుతుందని తెలుసు. అలాంటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించడం సంతోషంగా ఉంది. డరిల్ మిచెల్ అద్భుతంగా ఆడాడు. కీలక సమయాల్లో సమయోచితంగా ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. ఈ రోజు అతని సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. తీవ్ర ఒత్తిడిలో అతను అద్భుతంగా ఆడగలడని తెలిసింది. అతనిది అద్భుతమైన ఇన్నింగ్స్. ఇక టీ20 క్రికెట్ చిన్నమార్జిన్‌లతో కూడిన ఆట, పిచ్, తక్కువ పరుగులు చేయడం వంటివి మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయి. దాంతోనే చేతిలో వికెట్లు ఉంచుకోవడం ముఖ్యమని భావించాం. జిమ్మీ నీషమ్ వస్తూ వస్తూనే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ మూమెంటమ్ మొత్తం మారిపోయింది. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారింది.'అని కేన్ మామా చెప్పుకొచ్చాడు.

ఫైనల్‌పై దృష్టిసారిస్తాం..
ఇక ఫైనల్‌పై స్పందిస్తూ..'మా ఆటగాళ్లు ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ఎన్నో చూశారు. ఇదో అద్భుతమైన మ్యాచ్. తీవ్ర పోటీగల పోరు. మా ముందు
మరో సవాల్ ఉంది. మా విజయ అవకాశాలపై దృష్టిసారిస్తాం. పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతాం.'అని కేన్ మామ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.

చెలరేగిన జిమ్మీ, మిచెల్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ డరిల్ మిచెల్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అతనికి అండగా డేవాన్ కాన్వే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 82 పరుగుల జోడించారు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సమయోచిత బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చారు. చివర్లో జిమ్మీ నీషమ్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) పవర్ హిట్టింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












