Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే నటరాజన్‌ను పక్కన పెట్టాం: కేన్ విలియమ్సన్

 Kane Williamson say why T Natarajan not playing today match against DC

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు మార్పులతో బరిలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు మార్పులు చేసింది. ఆటగాళ్ల గాయాలు, టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే ఈ మార్పులు చేశామని ఇరు జట్ల కెప్టెన్లు తెలిపారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్, సీన్ అబాట్ రాగా.. వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, మార్కో జాన్సెన్ ఉద్వాసనకు గురయ్యారు. వాషింగ్టన్ సుందర్ గత మ్యాచ్‌లో గాయపడగా.. దారుణంగా విఫలమవుతున్న జాన్సెన్‌పై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేసింది. ఇక నటరాజన్ కూడా గాయపడ్డాడని, దాంతోనే అతన్ని తప్పించామని టాస్ సందర్భంగా కేన్ విలియమ్సన్ తెలిపాడు. డ్యూ ప్రభావం ఉంటుందనే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాన్నాడు.

'సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. అందుకే బౌలింగ్ ఎంచుకుంటున్నా. ఈ వికెట్ ఆరంభంలో బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగుతాం. మేం ఓడిన మ్యాచ్‌లు చాలా భిన్నమైనవి. చాలా క్లోజ్‌గా వచ్చి ఓడిపోయాం. ఆ ఓటముల నుంచి సానుకూలంశాలను తీసుకొని ఈ రోజు సత్తా చాటాలనుకున్నాం. జట్టులో మూడు మార్పులు చేశాం. జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ప్రతీ మ్యాచ్‌లో తాము అద్భుతంగా ఆడాం. చిన్న చిన్న తప్పిదాలను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసే సవాల్‌ను తాము సంతోషంగా స్వీకరిస్తున్నామని తెలిపాడు. జట్టులో మొత్తం నాలుగు మార్పులు చేశాం. పృథ్వీ షా, అక్షర్ పటేల్, ముస్తాఫిజుర్, చేతన్ సకారియాలు ఉద్వాసనకు గురవ్వగా.. నోర్జ్, మన్‌దీప్, రిపాల్, ఖలీల్ జట్టులోకి వచ్చారని చెప్పాడు. గాయాల కారణంగా కొందర్ని తప్పిస్తే మరికొందరిని పిచ్ కండిషన్స్ నేపథ్యంలో మార్చమని తెలిపాడు. ఓటముల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకోవడమే ముఖ్యమని చెప్పాడు.

తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పొవెల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్

Story first published: Thursday, May 5, 2022, 19:27 [IST]
Other articles published on May 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+