కోహ్లీ, స్మిత్‌లను అధిగమించడం ఆశ్చర్యం వేసింది.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: కేన్ మామ

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్‌ను అధిగమించడం గౌరవంగా భావిస్తున్నానని కేన్ తెలిపాడు. తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కేన్ అగ్రస్థానానికి చేరాడు. 2015లో మొదటిసారి టాప్ ర్యాంక్‌కు చేరిన విలియమ్సన్ (890) ఐదేళ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఆశ్చర్యం వేసింది
ఐసీసీ నిర్వహించిన ముఖాముఖిలో కేన్ విలియమ్సన్ మాట్లాడాడు. 'కోహ్లీ, స్మిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. వారిద్దరితో ఆడడం నా అదృష్టం. నేను అనూహ్యంగా వారిని అధిగమించడం ఆశ్చర్యం వేసింది. గౌరవంగా అనిపిస్తోంది. మన సత్తా మేరకు జట్టు కోసం మనం చేసిన ప్రదర్శనలు ర్యాంకింగ్స్‌లో ప్రతిబింబిస్తాయి. నిజానికి అదెంతో బాగుంటుంది. వ్యక్తిగత ర్యాంకులను నేనూ చూస్తుంటాను. ఇతర ఆటగాళ్లను అనుసరించి ర్యాంకులు మారుతుంటాయి. ఏదేమైనా జట్టు కోసం అత్యుత్తమంగా పోరాడటమే నాకిష్టం' అని కేన్ తెలిపాడు. కోహ్లీ, స్మిత్‌లను అధిగమించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.
129; 21తో అదరగొట్టాడు
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో కేన్ విలియమ్సన్ 129; 21తో సత్తాచాటాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఆడలేదు. ఇదే సిరీసులో స్టీవ్ స్మిత్ నాలుగు ఇన్నింగ్సుల్లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 10 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో 890 రేటింగ్ పాయింట్లతో విలియమ్సన్ టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకుకు ఎగబాకాడు. కోహ్లీ 879 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అగ్రస్థానంలో ఉన్న స్మిత్ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.

5 స్థానాలు ఎగబాకి
మెల్‌బోర్న్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానే సెంచరీతో రాణించి మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో రహానే ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. చేటేశ్వర్ పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ రెండు స్థానాలు ఎగబాకి 793 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. భారత్ స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
చహల్ సంగీత్.. గబ్బర్ చిందులు (వీడియో)!!