అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ మామ గుడ్‌బై!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముంగింపు పలికాడు. న్యూజిలాండ్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా గుర్తింపు పొందిన కేన్ విలియమ్సన్.. శుక్రవారం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నాడు.
'రిటైర్మెంట్ గురించి గత కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. ఇదే సరైన సమయమని భావించి నిర్ణయం తీసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే బలమైన ఆకాంక్ష నాకు ఎప్పుడూ ఉండేది. న్యూజిలాండ్ తరఫున ప్రతి మ్యాచ్‌లో నా సాయశక్తులా శ్రమించాను. స్వతహగా ఆట నుంచి తప్పుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నా.’అని కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు.
తెలుగు ఫ్యాన్స్‌కు కేన్ మామ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ తెలుగు అభిమానులకు సుపరిచితం. అతన్ని తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా కేన్ మామ అని పిలుస్తుంటారు. కేన్ మామ రిటైర్మెంట్ నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

విలియమ్సన్ తన కెరీర్‌లో 378 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 48.12 సగటుతో 19,346 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన కేన్ మామ.. ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
తొండాటతో గెలిచినా.. చెరగని చిరునవ్వు
కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ అద్బుతమైన విజయాలను అందుకుంది. కేన్ సారథ్యంలోనే న్యూజిలాండ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షి 2021ను కైవసం చేసుకుంది. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బౌండరీ రూల్ అనే అసంబద్దమైన రూల్‌తో న్యూజిలాండ్ టైటిల్ కోల్పోయినా.. కేన్ మామ ముఖంలో చిరునవ్వు చెరగలేదు. ఏ ఒక్కర్ని అతను నిందించలేదు.
కేన్ సారథ్యంలో 2016 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ చేరిన న్యూజిలాండ్.. 2021 టీ20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలవడంతో పాటు 2022 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్‌ల్లో సెమీస్ చేరింది.
క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం..
టెస్ట్ క్రికెట్‌లో కేన్ విలియమ్సన్ 40 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు సారథ్యం వహించి 22 విజయాలు అందించాడు. వన్డేల్లో 91 మ్యాచ్‌ల్లో 46 విజయాలు, టీ20ల్లో 75 మ్యాచ్‌ల్లో 35 విజయాలు నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన న్యూజిలాండ్ కెప్టెన్‌గా నిలిచాడు.
క్రీడాస్ఫూర్తికి కేన్ విలియమ్సన్ నిలువెత్తు నిదర్శనమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన 16 ఏళ్ల కెరీర్‌లో కేన్ విలియమ్సన్ ఎప్పుడూ మైదానంలో అనుచితంగా ప్రవర్తించలేదు. క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించలేదు. ఇప్పటికే కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేన్ మామ.. భవిష్యత్తులో పూర్తిస్థాయి కోచ్‌గా కొనసాగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

