న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘బ్రేక్‌ ద బియర్డ్‌’ ఛాలెంజ్‌ను స్వీకరించిన కేన్: అభిమానుల ఫిదా (వీడియో)

By Nageshwara Rao
kane williamson new look break the beard ipl

హైదరాబాద్: గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ ఎంత పాపులర్‌ అయిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మొదలైన సీజన్‌లో 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ను మరోసారి పరిచయం చేశాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌. వారం రోజుల క్రితం ధావన్‌ తాను 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ను స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు క్రికెటర్లకు షేర్ చేసిన ధావన్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సిందిగా సవాల్ విసిరాడు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా స్వీకరించి అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో భారత ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు కూడా పాల్గొన్నాడు. ఇంతకీ ఎవరా విదేశీ ఆటగాడు అని అనకుంటున్నారా? అతను ఎవరో కాదు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌. 'బ్రేక్‌ ద బియర్డ్‌' ఛాలెంజ్‌ను స్వీకరించిన విలియమ్సన్ అందుకు సంబంధించిన వీడియోని ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్‌ల్లో కేన్‌ విలియమ్సన్ గుబురు గడ్డంతో గడ్డంతో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించడంతో కొత్త లుక్‌లో కనిపించిన విలియమ్సన్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

కేన్‌తో పాటు మనీష్ పాండే, ముంబై ఆటగాడు కృనాల్ పాండ్యా కూడా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు. ఈ ఇద్దరు కూడా అందుకు సంబంధించిన వీడియోలను తమ తమ ఇనిస్టాగ్రామ్ ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో తలపడనుంది.

Story first published: Thursday, April 19, 2018, 12:57 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X