MI vs SRH: కేన్ మామ చెత్త కెప్టెన్సీ వల్లే మూడు మ్యాచ్‌ల్లో ఓటమి..లేకుంటే ప్లే ఆఫ్స్ చేరేవాళ్లం! ఫ్యాన్స్ ఫైర్

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై సొంత జట్టు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శనకు కేన్ విలియమ్సన్ చెత్త కెప్టెన్సీనే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. లీగ్‌లో 5 వరుస పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో అదరగొట్టింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మూడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
చివరి మ్యాచ్ గెలిచినా..
ఓవరాల్‌గా లీగ్‌లో ఆరో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ 12 పాయింట్లతో టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ముంబైపై విజయం సాధించినా హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, కోల్‌కతా టీమ్స్ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడినా.. పంజాబ్‌తో చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచినా మెరుగైన రన్ రేట్ లేని కారణంగా ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం(-230) నెగటీవ్‌గా ఉన్న ఆరెంజ్ ఆర్మీ రన్ రేట్ పాజిటీవ్‌గా మారాలంటే పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కేన్ సేన 100 పరుగుల భారీ తేడాతో గెలవాలి. లేదా 9 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించాలి. ఇది దాదాపు అసాధ్యం.
కేన్ మామ చెత్త కెప్టెన్సీనే కారణం..
అయితే ఈ పరిస్థితికి కేన్ విలియమ్సన్ చెత్త కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు. అతని పేలవ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు జట్టు ఓటములకు కారణమయ్యాయని మండిపడుతున్నారు. కేన్ కెప్టెన్సీ సరిగ్గా ఉంటే సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచేదని, ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరేదని మండిపడుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చిన కేన్.. 7 బంతుల్లో 8 పరుగులే చేసాడు. ఇందులో ఒకే ఒక బౌండరీ ఉంది. కనీసం మరో రెండు బౌండరీలు బాదినా సన్‌రైజర్స్ 200 పరుగులు ధాటేదని, అప్పుడు సైకలాజికల్‌గా ముంబైపై ఒత్తిడి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఉమ్రాన్ మాలిక్‌కు ఇవ్వకుండా..
ఇక కీలక సమయంలో కేన్ చేసిన తప్పిదంతో సన్‌రైజర్స్ మరో ఓటమిని తృటిలో తప్పించుకుందని విమర్శిస్తున్నారు. మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్‌తో కాకుండా అప్పటికే ధారళంగా పరుగలిచ్చిన నటరాజన్‌తో 18వ ఓవర్ వేయించడం కేన్ చేసిన ఘోర తప్పిదం అంటున్నారు. ఈ ఓవర్‌లో యార్కర్ల కోసం ప్రయత్నించిన నట్టూ.. ఏకంగా నాలుగు ఫుల్ టాస్‌లు వేసాడు. ఈ నాలుగు బంతులను టీమ్ డేవిడ్ సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. అయితే స్ట్రైకింగ్ తీసుకోవాలనే ఆరాటంలో ఆఖరి బంతికి సింగిల్ తీయాలనే అనాలోచిత నిర్ణయంతో అతను రనౌటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ బచాయించింది. లేకుంటే ఈ మ్యాచ్ కూడా ఓడేది.
అలా చేస్తే 40 పరుగుల తేడాతో గెలిచేది..
ఈ ఓవర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఇచ్చుంటే భారీ షాట్ ఆడే క్రమంలో టీమ్ డేవిడ్ ఔటయ్యేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అప్పుడు సన్‌రైజర్స్ కనీసం 30-40 పరుగుల భారీ తేడాతో గెలిచేదని, రన్‌రేట్ కూడా మెరుగయ్యేదని కామెంట్ చేస్తున్నారు. మూడు ఓవర్లు అద్భుతంగా వేసిన ఉమ్రాన్ మాలిక్‌ను కాదని ఇతరులతో బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయం కాదంటున్నారు. మొత్తానికి పేలవ బ్యాటింగ్ కారణంగా కేన్ కెప్టెన్సీ కూడా అభిమానులకు చికాకు తెప్పిస్తోంది. ఇక తాను చేసిన 8 పరుగుల వల్లే సన్‌రైజర్స్ గెలిచిందనే భ్రమలో కేన్ ఉన్నాడని ఫన్నీ మీమ్స్‌తో సెటైర్లు పేల్చుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications