Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విలియ‌మ్‌స‌న్ డ‌బుల్ సెంచ‌రీ.. కేన్ మామ ఖాతాలో రెండు రికార్డులు!!

Kane Williamson hits first double century in 2021

క్రైస్ట్‌చ‌ర్చ్‌: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌ అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 నుంచే కేన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా క్రీజులోకి వచ్చాడంటే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా తన టాప్ బ్యాటింగ్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన విలియ‌మ్‌స‌న్‌.. రెండ‌వ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. 327 బంతుల్లో 24 బౌండరీలతో ద్విశతకం అందుకున్నాడు. దీంతో 2021లో మొదటి ద్విశతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు.

టెస్టుల్లో ఏడు వేల ప‌రుగులు

టెస్టుల్లో ఏడు వేల ప‌రుగులు

రెండ‌వ టెస్టు మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌ 364 బంతుల్లో 238 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. విలియ‌మ్‌స‌న్ ఇన్నింగ్స్‌లో 28 బౌండ‌రీలు ఉన్నాయి. 30 ఏళ్ల విలియ‌మ్‌స‌న్ ఖాతాలో ఈరోజు రెండు రికార్డులు చేరాయి. టెస్టుల్లో ఏడు వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న కివీస్ ప్లేయ‌ర్‌గా కేన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. గ‌తంలో కివీస్ ఆట‌గాళ్లు రాస్ టేల‌ర్ ‌(7379), స్టీఫెన్ ఫ్లెమింగ్‌ (7172) ఈ మైలురాయిని దాటారు. అంతేకాదు కేన్ ఏడు వేల ప‌రుగులను అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో చేరుకున్నాడు. కేన్ 83 ఇన్నింగ్స్‌లలో ‌ఏడు వేల ప‌రుగులు చేయగా.. టేల‌ర్ (96), ఫ్లెమింగ్‌ (105) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

నాలుగు డ‌బుల్ సెంచ‌రీలు

నాలుగు డ‌బుల్ సెంచ‌రీలు

కేన్ విలియ‌మ్‌స‌న్ మొత్తం నాలుగు డ‌బుల్ సెంచ‌రీలు చేశాడు. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో కేన్ రెండ‌వ సారి డ‌బుల్ సెంచ‌రీ చేయడం విశేషం. నాలుగు డ‌బుల్ సెంచ‌రీలు చేసి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ సరసన చేరాడు. కివీస్ తరఫున ఈ ఇద్దరే అత్యధికంగా డ‌బుల్ సెంచ‌రీలు నమోదు చేశారు. అయితే మెక్‌కల్లమ్ ఇప్పటికే క్రికెట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో విలియ‌మ్‌స‌న్ అతడిని అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లోనూ ద్విశతకం

ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో కేన్ విలియ‌మ్‌స‌న్ డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ఆ మ్యాచ్‌లో అత‌ను 251 ప‌రుగులు చేశాడు. అయితే ఆ జ‌ట్టుతో జ‌రిగిన రెండ‌వ టెస్ట్ మ్యాచ్‌ను అత‌ను మిస్స‌య్యాడు. పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 129 ర‌న్స్ చేశాడు. ఇక పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల‌స్‌తో క‌లిసి విలియ‌మ్‌స‌న్ భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఆపై డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. క్రైస్ట్‌చ‌ర్చ్ టెస్టులో పాక్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 297 ర‌న్స్ చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పాక్ త‌న రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఒక వికెట్ కోల్పోయింది. ఇంకా 357 రన్స్ వెనకబడి ఉంది.

టీమిండియాకు భారీ షాక్.. గాయంతో స్టార్ బ్యాట్స్‌మన్‌ ఔట్!!

Story first published: Tuesday, January 5, 2021, 12:13 [IST]
Other articles published on Jan 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+