Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs ENG: చరిత్ర సృష్టించిన కేన్ మామ..!

న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఒక వేదికగా వరుసగా ఐదు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా కేన్ మామ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టకర రీతిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో రాణించాడు. 204 బంతుల్లో 20 ఫోర్లు, సిక్స్‌తో 156 పరుగులు చేశాడు.

Kane Williamson Creates History Becomes First Player In The World To Score 5 Consecutive Centuries At A Single Venue
Photo Credit: X

హామిల్టన్ వేదికగా కేన్ మామకు ఇది వరుసగా ఐదో టెస్ట్ సెంచరీ కావడం విశేషం. 2019లో బంగ్లాదేశ్‌పై ద్విశతకం నమోదు చేసిన కేన్ మామ.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. 2020లో వెస్టిండీస్‌పై 251, 2024లో సౌతాఫ్రికాపై 133 నాటౌట్ పరుగులు చేశాడు.

ఇక ఒకే వేదికగా అత్యధిక టెస్ట్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలోనూ కేన్ మామ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, వీవీఎస్ లక్ష్మణ్, గర్‌ఫీల్డ్ సోబెర్స్, జహీర్ అబ్బాస్.. కేన్ విలియమ్సన్ కంటే ముందున్నారు.

సెంచరీతో రాణించిన కేన్ విలియమ్సన్‌కు హామిల్టన్ క్రౌడ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు బిగించింది. ఇప్పటికే 550 ప్లస్ రన్స్ ఆధిక్యాన్ని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టామ్ లాథమ్(63), మిచెల్ సాంట్నర్(76) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేన్ విలియమ్సన్(44) తృటిలో చేజార్చుకున్నాడు. బంతిని వికెట్లపైకి తన్నుకొని వెనుదిరిగాడు.

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. మ్యాట్ హెన్రీ(4/48) నాలుగు వికెట్లు తీయగా.. విల్ ఓ రూర్కీ, మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. దాంతో న్యూజిలాండ్‌కు 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. భారీ ఇన్నింగ్స్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 85 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్లకు 361 పరుగులు చేసింది.

ఈ మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచినా.. ఆ జట్టుకు ఫలితం దక్కదు.

Story first published: Monday, December 16, 2024, 10:30 [IST]
Other articles published on Dec 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+