ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి

Posted By:
Kane Williamson

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.... రెండేళ్ల నిషేధం వేటు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ కూడా స్టీవ్ స్మిత్ స్థానంలో రహానేను కెప్టెన్‌గా నియమించింది. అనూహ్యంగా వీరిద్దరూ నాయకత్వ బాధ్యతలు అందుకున్నారు.

ఐపీఎల్‌లో హైదరాబాద్ బోణీ: చెలరేగిన ధావన్, రాజస్థాన్‌పై అలవోక విజయం

అయితే, వీరిద్దరూ టాస్‌ వేయడానికి వెళ్లినప్పుడు ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. తన జట్టులోని విదేశీ ఆటగాళ్ల పేరు చెప్పే క్రమంలో విలియమ్సన్ నాలుగో ఆటగాడి పేరు గుర్తు తెచ్చుకోలేపోయాడు. దీంతో అతడి అవస్థను గమనించిన రహానే.. నాలుగో విదేశీ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అంటూ గుర్తు చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ ఉల్ హాసన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

మూడు బంతుల వ్యవధిలో రాహుల్ త్రిపాఠి (17), సంజూ శాంసన్ (49)లను పెవిలియన్ చేర్చాడు. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్ వెను వెంటనే అవుటవడంతో.. రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు చేసింది.

అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి సన్ రైజర్స్ హైదరాబాద్ 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 54 బంతుల్లో 73 పరుగులు, విలియమ్సన్ 35 బంతులు 36 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో సోమవారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 23:45 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి