Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కోచ్‌గా కేన్ మామ!

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. 'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి'అనే సూత్రాన్ని ఈ న్యూజిలాండ్ బ్యాటర్ పాటిస్తున్నాడు. కెరీర్ చివరి దశలో ఉన్న కేన్ మామ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పకముందే.. భవిష్యత్తు‌కు బాటలు వేసుకుంటున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి చిరస్మరణీయ విజయాలు అందించిన కేన్ మామ.. గత సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

దాంతో కామెంటేటర్‌గా అవతారమెత్తిన కేన్ మామ.. అప్‌కమింగ్ సీజన్ కోసం కోచ్‌గా కొత్త రోల్ పోషించేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) జట్టుకు స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా పనిచేయనున్నాడు. ఈ విషయాన్ని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

Kane Williamson Appointed as Strategic Advisor for Lucknow Super Giants Ahead of IPL 2026

'సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగంగా ఉన్న కేన్ విలియమ్సన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ టీమ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. అతని నాయకత్వం, వ్యూహాత్మక అంతర్దృష్టి, ఆటపై లోతైన అవగాహన, ఆటగాళ్లను ఉత్తేజపరిచే సామర్థ్యం జట్టుకు ఎంతో విలువ తీసుకురానుంది.'అని సంజీవ్ గోయెంకా పేర్కొన్నాడు.

గత సీజన్‌లో లక్నో జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌‌గా బాధ్యతల నిర్వర్తించిన జహీర్ ఖాన్ తప్పుకోవడంతో అతని స్థానాన్ని కేన్ విలియమ్సన్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ బౌలింగ్ కోచ్ నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లక్నో సూజర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ ఉన్న విషయం తెలిసిందే. కేన్ విలియమ్సన్ మెంటార్‌గా జట్టుకు సేవలందించనున్నాడు.

34 ఏళ్ల కేన్ విలియమ్సన్ ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 2,128 పరుగులు చేశాడు. 2015 నుంచి 2022 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన కేన్ విలియమ్సన్.. కెప్టెన్‌గా కూడా సేవలందించాడు. ఐపీఎల్ 2018లో ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన కేన్ మామ.. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ఆ జట్టులోనే కొనసాగిన అతను రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా నిలవడంతో అతని కెరీర్‌కు తెరపడింది.

Story first published: Thursday, October 16, 2025, 13:01 [IST]
Other articles published on Oct 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+